ఒక చాయ్ దుకాణంలో టీ తాగేందుకు రాత్రి 11:30లకు పవన్ అనే యువకుడు తన సోదరితోపాటు మరో యువతితో కలిసి వచ్చాడు.
హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. టీ తాగేందుకు వెళ్లిన అక్క తమ్ముళ్లపై మద్యం సేవించిన ఒక ఆకతాయి అసభ్యకర కామెంట్స్ చేశాడు. దీంతో కోపం ఆపుకోలేక తమ్ముడు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మత్తు వదిలించాడు. అతగాడినికి పట్టుకుని ఎడాపెడా వాయించాడు. ఈ దాడిలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.. ఈ సంఘటనలో తాగుబోతు వెంకటరమణ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కూకట్‌పల్లిలో నవంబర్ 22న ఈ ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం పక్కనే ఉన్న ఒక చాయ్ దుకాణంలో టీ తాగేందుకు రాత్రి 11:30లకు పవన్ అనే యువకుడు తన సోదరితోపాటు మరో యువతితో కలిసి వచ్చాడు. అదే సమయంలో వెంకటరమణ అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో టీ షాప్ వద్ద ఉన్నారు. అయితే వెంకటరమణ మద్యం మత్తులో ఉన్నాడు. టీ తాగేందుకు అక్కడికి వచ్చిన పవన్ సిస్టర్స్‌ను వెంకటరమణ వేధించాడు.
తమ సిస్టర్స్‌పై అసభ్యంగా మాట్లాడాడంటూ వెంకటరమణపై చేయి చేసుకున్నాడు పవన్. వెంకటరమణ తోపాటు వచ్చిన మరో ఇద్దరు పవన్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో విషయం తెలుసుకున్న పవన్ స్నేహితులు ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య పెద్ద ఫైటింగ్ సీన్ నడిచింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న షాప్ లోని చపాతీ కర్ర తీసుకుని వెంకటరమణ తలపై బలంగా కొట్టాడు పవన్. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువర్గాలు తీవ్రంగా గొడవపడ్డారు.
తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణను హాస్పిటల్‌కు తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వెంకటరమణ ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన పవన్ తోపాటు మిగతా యువకులు ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. తమ సోదరిని అసభ్యంగా కామెంట్ చేసినందుకే దాడి చేయాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో పవన్ ఒప్పుకున్నాడు. దాడి జరిగిన దృశ్యాలు అన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి…
Also read
- Telangana: తస్మాత్ జాగ్రత్త..ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. కొంప కొల్లేరే!
- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి…..
- AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
- Andhra Pradesh: ఆమె సాఫ్ట్వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్‌లో అసలు ఏం జరిగిందంటే..
- Telangana: మోజు తీరిన తరువాత అవౌడ్ చేశాడు.. పాపం ఆ యువతి.. వీడియో