తమ ప్రేమకు అడొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లిపై దారుణంగా దాడికి తెగబడ్డాడు ఉన్మాది. గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం సుద్దాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరుగు పొరుగు వారు అడ్డుకోవడంతో మహిళ ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ పెళ్ళికి ప్రియురాలి తల్లి అడ్డు వస్తుందని ప్రియుడు దాడికి తెగబడ్డాడు. అందరూ చూస్తుండగానే ఆమె చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇరుగు పొరుగు వారి ముందే ఆమె గొంతు నులిమి చంపబోయాడు. చివరికి స్థానికులు బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ శాడిస్ట్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం సుద్దాలపల్లె గ్రామంలో తమ ప్రేమకు అడ్డొస్తుందని ప్రియురాలు తల్లి చామంతి ప్రేమోన్మాది గొంతు నులిమి హత్య చేయడానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకన్న పోలీసులు రిమాండ్కు పంపారు. సుద్దాలపల్లె గ్రామానికి చెందిన ఓ యువతికి.. అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన తల్లి చామంతి కూతురును మందలించింది. ఇంకోసారి ఫోన్ మాట్లాడవద్దని హెచ్చరించింది.
యువతి తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. కుటుంబ పరిస్థితిని తన కూతురు వివరించి మనసు మార్చేందుకు ప్రయత్నించింది తల్లి. దీంతో ఇంట్లో కుదిర్చిన వివాహానికి ఒప్పుకుంది. మార్చి నెలలోనే మరొకరితో పెళ్లికి సిద్ధమై, వర పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తమ ప్రేమకు అడ్డు వస్తుందనే నెపంతో చామంతిని హత్య చేయాలని భావించాడు. బహిరంగంగానే అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా కొట్టి గొంతు నులిమి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రాజ్ కుమార్ ఇరుగుపొరుగు చూసి అడ్డుకోవడంతో బాధితురాలు బతికి బయటపడింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వి శేఖర్ తెలిపారు. మహిళపై దాడికి దిగిన వ్యక్తిని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం చామంతి కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు
Also read
- ఈ 4 రాశులకు వరంలా లక్ష్మీ నారాయణ యోగం.. డబ్బు, విజయాలు, విలాస జీవితం ఇక ఖాయం!
- నరక లోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట
- నేటి జాతకములు…27 ఏప్రిల్, 2026
- లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
- కార్మిక చట్టాల అమలు కు దీక్షాదినంగా మేడే….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.





