SGSTV NEWS
CrimeTelangana

భద్రాద్రి రామయ్య భూములపై మరోసారి రగడ.. ఈవోపై గ్రామస్థుల దాడి.. అసలేం జరిగిందంటే..



ఏపీ, తెలంగాణ మధ్య భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరింత ముదిరింది. ఏకంగా.. ఆలయ అధికారులపై దాడుల వరకు వెళ్లింది. ఎస్‌.. ఏపీలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి చెందిన భూముల వ్యవహారం మరోసారి కాక రేపింది. ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది.


ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఆలయ అధికారులను పురుషోత్తపట్నం గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. ఆలయ ఈవో రమాదేవి, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల తోపులాటలో భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. అలాగే.. ఈవో రమాదేవికి రక్షణగా నిలిచే క్రమంలో ఆలయ అటెండర్‌ వినీల్‌ సైతం ఒత్తిడి గురయ్యారు. దాంతో.. ఇరువుర్ని భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు.. ఆస్పత్రికి వెళ్లి ఈవో రమాదేవి, అటెండర్‌ వినీల్‌ను పరామర్శించారు.


ఇక.. అల్లూరి జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి సుమారు 889 ఎకరాల భూములు ఉన్నాయి. పురుషోత్తపట్నం గ్రామం.. గతంలో భద్రాచలం రూరల్‌ మండలంలో పట్టణానికి ఆనుకుని ఉండగా.. విభజన తర్వాత.. అల్లూరి జిల్లాలోని ఎటపాక మండలంలోకి వెళ్లింది. దాంతో.. అప్పటినుంచి ఈ భూముల విషయంలో రగడ కొనసాగుతోంది. రోజురోజుకీ ఆక్రమణలు పెరిగిపోవడంతో వాటిని అడ్డుకునేందుకు భద్రాచలం ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు

Also read



Related posts

Share this