హనుమకొండ జిల్లాలో దుండగుడు రెచ్చిపోయాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఆటో డ్రైవర్‌ను అడ్డగించిన మరో ఆటో డ్రైవర్ కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం స్థానికులను కత్తులతో బెదిరిస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
హనుమకొండలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో.. ప్రధాన రహదారిపై కత్తులు కోలాటం చేశాయి. ఓ ఆటో డ్రైవర్‌ను అందరు చూస్తుండగానే పట్టపగలే మరో ఆటో డ్రైవర్ కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు.. అంతా చూస్తుండగానే హతమార్చి అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ హత్య హన్మకొండలోని అదాలత్ సెంటర్‌లో జరిగింది. హైదరాబాద్ – హనుమకొండ ప్రధాన రహదారిపై ఆటో డ్రైవర్‌ను ఆపిన మరో ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి హతమార్చాడు. అంతా చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో ఛాతీలో పొడిచి హతమార్చాడు.. కత్తిపోట్లతో గాయపడ్డ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదంతా జరుగుతున్న అక్కడున్న స్థానికులు ఎవరు ముందుకు వచ్చి ఆపేంత ధైర్యం చేయలేకపోయారు. హత్య అనంతరం అదే కత్తితో అందరిని బెదిరిస్తూ.. దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు మడికొండ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే ఆటోడ్రైవర్ గా గుర్తించారు. డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆర్థిక లావాదేవీలు ఇంతటి దారుణానికి కారణమా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోరడంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తితో పొడిచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





