జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలి హత్య సంచలనం సృష్టించింది.. అతి కిరాతకంగా ఆమెను చంపిన గుర్తు తెలియని దుండగులు గోనెసంచిలో కట్టి వృద్ధురాలి మృతదేహాన్ని ఊరి చివర వ్యవసాయ బావిలో పడేశారు. దొంగలు బంగారం కోసం ఈ దారుణానికి ఒడి గట్టరా..? లేక ఏదైనా ఆస్తి వివాదం లేదా ఇంకేమైనా కుట్రకోణం ఉందా..? అనే అనుమానాలతో పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనం సృష్టించింది. అత్యంత పాశవికంగా ఆమెను హతమార్చిన గుర్తు తెలియని దుండగులు.. గోనెసంచిలో కట్టి వ్యవసాయ బావిలో పడేశారు. వృద్ధురాలి మృతదేహాన్ని ఊరి చివర వ్యవసాయ బావిలో ఐదు రోజుల తర్వాత గుర్తించారు. వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి గ్రామ శివారులో జరిగింది. బోయినపల్లి గ్రామానికి చెందిన సూరపాక వీరమ్మ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి19వ తేదీన గర్మిళ్లపల్లి గ్రామానికి వెళ్లిన వీరమ్మ తిరిగి రాలేదు. అతర్వాత అదృశ్యం అయిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే, ఆమె ఒంటిపై బంగారు నగలు ఉన్నాయి. ఆమె ఏమైపోయిందో తెలియక కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్న క్రమంలోనే సోమవారం సాయంత్రం గర్మిళ్లపల్లె శివారులోని వ్యవసాయ బావిలో వీరమ్మ మృతదేహం లభ్యమయింది. అత్యంత దారుణంగా వీరమ్మని చంపి గోనెసంచిలో మూటకట్టి ఆ వ్యవసాయ బావిలో పడేశారు గుర్తు తెలియని దుండగులు. ఐదు రోజుల తర్వాత బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు. అయితే వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
దొంగలు బంగారం కోసం ఈ దారుణానికి ఒడి గట్టరా..? లేక ఏదైనా ఆస్తి వివాదం లేదా ఇంకేమైనా కుట్రకోణం ఉందా..? అనే అనుమానాలతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి