నిత్యం వేధిస్తున్న ఆకతాయికి తగిన బుద్ధి చెప్పింది యువతి. పక్కా స్కెచ్ వేసి పిలిపించి అందరి ముందు చితకబాదింది.
జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి శివమెత్తింది. తనను వేధిస్తున్న ఆకతాయిలను తగిన బుద్ధి చెప్పింది. వారి వేధింపులు భరిస్తూ వచ్చిన యువతి చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేసింది. వారిని వెంటపడి మరీ, ఎడాపెడా వాయించింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద జరిగింది.
గానుగుపహాడ్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రెండు రోజుల నుండి ఓ యువతి వెంటపడి వేధిస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో, వెకిలి చేష్టలతో వేధించారు. దీంతో శివమెత్తిన యువతి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చిక్కకపోవడంతో మాట్లాడదాం రమ్మంటూ మధ్యవర్తులతో పిలిపించింది. బతుకమ్మ కుంట వద్దకు చేరుకోగానే ఆ యువతితో సహా కుటుంబ సభ్యులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు.
అతగాడిని పట్టుకుని ఎడా పెడా వాయించారు. దేహశుద్ధి చేశారు. చివరికి జరిగి దానికి క్షమాపణ చెప్పడంతో శాంతించిన యువతి కుటుంబసభ్యులు వదిలేశారు
Also Read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





