SGSTV NEWS
CrimeTelangana

Warangal: టీవీ రిపేర్ చేస్తామని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి.. కాసేపటికే సీన్ సితార్..!

ఇదొక డిఫరెంట్ టైప్ దొంగతనం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులను గమనించిన దుండగులు మీ కొడుకు పంపించాడు TV రిపేర్ చేయాలని నమ్మించి ఇంట్లోకి చొరబడ్డాడు. టీవీ రిపేర్ చేస్తున్నట్లు నమ్మించి ఇంట్లో ఉన్న బంగారం, నగదు అపహరించుకుపోయారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ చోరీ ఘటన హనుమకొండ జిల్లా నడికుడ మండలం వరికోలు గ్రామంలో జరిగింది.. గాలి రాజు అనే వ్యక్తి ఇంట్లో ఈ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు టీవీ రిపేర్ చేస్తానని చెప్పి బంగారంతో పాటు వెండి నగదును ఎత్తుకెళ్లాడు. రాజు తన భార్య తోపాటు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళాడు. తల్లిదండ్రులు ఇద్దరే వృద్ధులు ఇంటి వద్ద ఉన్నారు.. మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, నీ కొడుకు రాజు ఫోన్ చేసి చెప్పాడు.. ఇంట్లో టీవీ రిపేర్ చేయమని పంపించాడని నమ్మబలికి ఇంట్లోకి చొరబడ్డాడు.

టీవీ రిపేర్ చేస్తున్నట్లు నటించి.. బీరువాలో ఉన్న రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు, 20 తులాల వెండి, పదివేల రూపాయల నగదు అపహరించుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దొంగలను పట్టుకుని తమ నగలను, డబ్బును ఇప్పించాలంటూ బాధితులు కోరుతున్నారు

Also read

Related posts

Share this