July 3, 2024
SGSTV NEWS
CrimeTrending

Gaming Lady Don: వ్యాపారస్తులను ఆటాడిస్తోన్న లేడీ డాన్‌.. ఇలా సింపుల్‌గా దొరికిపోయింది..!

ఓ వ్యాపారవేత్త ఫిర్యాదుతో లేడీ డాన్‌ గుట్టురట్టయింది. ఖాజాగూడలో గుట్టుగా గేమింగ్ స్థావరాన్ని ఏర్పాటు చేసి.. డబ్బులు సంపాదిస్తోన్న మాధవీలత దందాకు పోలీసులు చెక్‌ పెట్టారు. మూడు ముక్కలాటలో లక్షలు పోగొట్టుకున్న మాధవీలత బాధితుల జాబితా పెద్దగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. పక్కా సమాచారంతో మరీ ఫ్లాన్ చేసి ఛేజ్ చేశారు సైబరాబాద్ పోలీసులు.

ఈజీ మనీకి అలవాటుపడి వ్యాపారస్తులను ఆటాడిస్తోన్న లేడీ డాన్‌ గుట్టురట్టయింది. వ్యాపారస్తులను టార్గెట్ చేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోన్న లేడీ డాన్‌ను హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ SOT టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కమ్మంపాటి మాధవీలత బడా వ్యాపారులకు వల వేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోంది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని ఖాజాగూడలో గుట్టుగా ఈ గేమింగ్ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. గత కొంత కాలంగా ఈ దందా నడుస్తోంది.

వివిధ ప్రాంతాల నుంచి ఫంటర్స్‌ను పిలిపించి పెద్ద ఎత్తున గేమింగ్ నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగుతున్న మూడు ముక్కలాటలో ప్రతి ఆటకు వెయ్యి చొప్పున ఫీజు వసూలు చేస్తోంది. ప్రతీ రోజూ 100 నుంచి 150కిపైగా గేములు నిర్వహించి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తోంది. వారికి ఇంట్లోనే మద్యం కూడా సరఫరా చేస్తూ అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతోంది. పలువురు బడాబాబులు గేమింగ్‌లో లక్షలు నష్టపోయారని తెలిసింది. ఇందుకు సంబంధించి మరిన్ని కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఓ వ్యాపారవేత్త ఫిర్యాదుతో ఈ లేడీ డాన్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ SOT టీమ్ ఖాజాగూడలోని గేమింగ్ స్థావరంపై దాడి చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు, 11 మొబైల్స్, ప్లేయింగ్ కార్డ్స్ పోలీసులు సీజ్ చేశారు. మాధవీలతతో పాటు 9 మందిని అరెస్ట్ చేసి వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

Also read

Related posts

Share via