చట్టాలెన్నో వచ్చాయి…కానీ అత్యాచారాలు ఆగడం లేదు. కఠిశిక్షలెన్నో అమల్లో ఉన్నాయి. కానీ కొందరిలో ఆ పశుతత్వం నశించడంలేదు. ఆఖరికి పసి పిల్లల్ని, పండుటాకుల్ని కూడా వదలిపెట్టడం లేదు కామాంధులు. ఇలాంటివారిని ఏం చేయాలి… చట్టం అనుమతిస్తే నడిరోడ్డు మీదే ఉరితీయాలన్నంత కోపం వస్తోంది. తాజాగా తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.
ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని దారుణమైన ఘటనలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కామాంధులు బరి తెగించి వ్యవహరిస్తూనే ఉన్నారు. అరే చిన్నపిల్లలు…రెండేళ్లు.. మూడేళ్ల పసిమొగ్గలను కూడా చిదిమేస్తున్నారు. పండుటాకులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా 70 ఏళ్ల యాచకురాలిపై కన్నేసిన ఓ నీచ్ కమీనే.. .. ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఘటన జరిగిన 70 రోజుల తర్వాత కేసు నమోదు అవ్వడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఈ దారుణం వెలుగుచూసింది.
మాల్ గ్రామంలోని SBI బ్యాంకు సమీపంలో 70 ఏళ్లు ఉండే ఓ వృద్ధురాలు భిక్షాటన చేస్తూ బ్రతుకు వెళ్లదీస్తుంది. అయితే.. 2024 డిసెంబర్ 9వ తేదీన స్థానికంగా మేస్త్రీ పనులు చేసే వచ్చిన 30 ఏళ్ల యువకుడు.. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఆ కామాంధుడికి ఆమెపై కన్నుపడింది. ఆమె వయస్సు చూసి కూడా వాడికి కనికరం వేయలేదు. ఎవరూ లేని సమయం గమనించి.. ఆమెపై తన పశువాంఛ తీర్చుకున్నాడు. అయితే నిందితుడి నుంచి తప్పించుకునేందుకు వృద్ధురాలు ప్రతిఘటించడంతో.. తలకు గాయమయ్యి ఆమె మరణించింది. ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తొలుత కింద పడటంతో దెబ్బ తగిలి చనిపోయిందేమో అనుకున్నారు. సీసీ కెమెరా విజువల్స్ చూడగా దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని స్థానిక పోలీసులు లైట్ తీసుకున్నారు. భిక్షాటన చేసే వృద్ధురాలే కదా అని పట్టించుకులేదు. ఘటన జరిగిన దాదాపు 70 రోజుల తర్వాత విషయం.. రాచకొండ సీపీ సుధీర్ బాబు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్థానిక పోలీసులపై సీరియస్ అయ్యారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
Also read
- Hyderabad: టీచర్ మందలించాడనీ.. స్కూల్ బిల్డింగ్పై నుంచి దూకిన 8వ తరగతి విద్యార్ధి!
- Andhra News: బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన ఖాతాదారుడు.. కట్ చేస్తే
- తస్మాత్ జాగ్రత్త..! మాయమాటలే పెట్టుబడి.. ఏకంగా లక్షల్లో సంపాదన..!
- వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మంచం కింద దూరిన వైసీపీ నేత ఇదిగో వీడియో
- ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?