July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

భద్రాచలం : బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు ప్రయాణీకులు… ఆపి వారి బ్యాగులు చెక్ చేయగా..

బస్టాండ్ వద్ద తచ్చాడుతూ కనిపించారు. పోలీసులను చూసి టెన్షన్ పడ్డారు. దీంతో డౌట్ వచ్చింది. వారిద్దర్ని దగ్గరకు పిలిచిన పోలీసులు.. ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారు వంటి వివరాలు అడిగారు. వారిద్దరూ పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో….

అరెస్టులు చేస్తున్నారు. కఠిన సెక్షన్లు పెట్టి.. జైల్లో వేస్తున్నారు. అన్ని మార్గాల్లో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అయినా గంజాయి దందా చేసేవాళ్లు మారడం లేదు. ఎవ్వడి మాట వినేది లేదు అన్నట్లు.. గుట్టుగా యవ్వారం సాగిస్తున్నారు. తాజాగా ఓ ఇద్దరు గంజాయి అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. వారు కాస్త టెన్షన్ పడుతూ కనిపించడంతో.. సమీప ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తోన్న పోలీసులకు డౌట్ వచ్చింది. దగ్గరకు పిలిచి ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో బ్యాగులు ఓపెన్ చేసి.. చూపించాలని పోలీసులు సూచించారు. ఓ సంచి జిప్పు తీయగానే లోపలి నుంచి గుప్పుమని గంజాయి వాసన వచ్చింది. బ్యాగు లోపల 4 కేజీలు గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు

గంజాయితో దొరికిన నిందితులను పెరుమాండ్ల శ్రవణ్ కుమార్, ఇక్కిరి భాస్కర్‌లుగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులని మోత్కూర్ గ్రామంగా తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరూ జట్టు కట్టి.. గంజాయి అక్రమ రవాణాకు పూనుకున్నారు. ఈజీ మనీ కోసం గంజాయి తరలించాలని ఫిక్సయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులకు పట్టబడ్డారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు వారి వద్ద ఉన్న రెండు ఫోన్లను సీజ్ చేశారు.

Also read

Related posts

Share via