వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కోడ్ ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేశారనే కారణంతో ఆదివారం తెదేపా కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు
వీరులపాడు, నందిగామ, : వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కోడ్ ఉల్లంఘనపై సీ- విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేశారనే కారణంతో ఆదివారం తెదేపా కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు గ్రామానికి చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు, వైకాపా నాయకుడు పూల రాంబాబు ఇంటి గేటుకు ఆ పార్టీ రంగులు ఉన్నాయి. దీంతో అదే గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త షేక్ నాగుల్‌బాషా తన సెల్‌ఫోన్‌తో ఆ గేట్ ఫొటో తీసి సీ- విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు గేటుకు పరదాలు కప్పి చర్యలు తీసుకున్నారు. స్థానికుల ద్వారా షేక్ నాగుల్‌బాషా ఫిర్యాదు చేశారని తెలుసుకున్న రాంబాబు, తన సోదరుడు పూర్ణ, ఆకుల గోవిందరావును వెంటబెట్టుకుని.. బాధితుడు నడిపిస్తున్న చికెన్ దుకాణం వద్దకు వెళ్లారు. ఇంతలోనే పూర్ణ.. బాషా చెయ్యి మెలివేస్తూ దాడి చేశాడు. ‘ఒక్క రెండు నెలలు ఆగండి, మీ సంగతి చూస్తాం’ అని గోవిందరావు బెదిరించాడు. సమాచారం అందుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై మహాలక్ష్ముడు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. బాషా ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Also read
- Hyderabad: కుటుంబసభ్యులకు లోకేష్ షేర్ చేసి ఫోన్ స్విచ్చాఫ్.. అనుమానంతో వెళ్లి చూస్తే షాక్!
- విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?
- రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్
- శరన్నవరాత్రి Day 2: గాయత్రీ దేవిగా దుర్గమ్మ! వేదమాత విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి! ఇంద్రకీలాద్రి 2026
- శక్తి మాసంగా ఆశ్వయుజానికి పేరెలా వచ్చింది? శక్తి ఆరాధనకు ఈ నెల ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?





