July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారని తెదేపా కార్యకర్తపై దాడి

వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కోడ్ ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారనే కారణంతో ఆదివారం తెదేపా కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు

వీరులపాడు, నందిగామ, : వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కోడ్ ఉల్లంఘనపై సీ- విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారనే కారణంతో ఆదివారం తెదేపా కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు గ్రామానికి చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు, వైకాపా నాయకుడు పూల రాంబాబు ఇంటి గేటుకు ఆ పార్టీ రంగులు ఉన్నాయి. దీంతో అదే గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త షేక్ నాగుల్బాషా తన సెల్ఫోన్తో ఆ గేట్ ఫొటో తీసి సీ- విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు గేటుకు పరదాలు కప్పి చర్యలు తీసుకున్నారు. స్థానికుల ద్వారా షేక్ నాగుల్బాషా ఫిర్యాదు చేశారని తెలుసుకున్న రాంబాబు, తన సోదరుడు పూర్ణ, ఆకుల గోవిందరావును వెంటబెట్టుకుని.. బాధితుడు నడిపిస్తున్న చికెన్ దుకాణం వద్దకు వెళ్లారు. ఇంతలోనే పూర్ణ.. బాషా చెయ్యి మెలివేస్తూ దాడి చేశాడు. ‘ఒక్క రెండు నెలలు ఆగండి, మీ సంగతి చూస్తాం’ అని గోవిందరావు బెదిరించాడు. సమాచారం  అందుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై మహాలక్ష్ముడు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. బాషా ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Also read

Related posts

Share via