2019 ఎన్నికల వేళ, జగన్ ప్రచార పర్వంలో జరిగిన సంఘటన అది. ఆయనపై కోడికత్తితో జరిగిన దాడి నేటికీ సస్పెన్స్ గానే మిగిలింది. కోడికత్తి నిందితుడు ఏ ఉద్దేశంతో దాడి చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారు, అసలెందుకు చేశారనేది నేటికీ అంతు చిక్కలేదు. నిందితుడికి కోర్టు బెయిలిచ్చింది. ఇటు కోర్టులో తనవైపు వాదనలు వినిపించాల్సిన జగన్ నేటికీ ఆ కేసు విషయంలో సీరియస్ గా లేరు. దీంతో ఏళ్ల తరబడి రిమాండ్ ఖైదీగా జైలులో మగ్గి ఎట్టకేలకు బెయిల్ పై బయటకొచ్చారు నిందితుడు శ్రీను.
కోడికత్తి కేసు కి ఏడేళ్లు..
2018 అక్టోబర్ లో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. దాడి జరిగిన వెంటనే ఇది టీడీపీ కుట్ర అంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అభిమానిగా నిందితిడ్ని చిత్రీకరిస్తూ కొన్ని ఫొటోలు కూడా విడుదల చేశారు. ఆ తర్వాత నిందితుడికి వైసీపీతో సంబంధాలున్నాయని, జగన్ పై సింపతీ క్రియేట్ చేయడం కోసమే దాడి చేశారనే వాదన కూడా వినపడింది. కానీ కోర్టు కేసులో ఏదీ తేలకపోవడం విశేషం. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుని చెబుతోంది. అయితే బాధితుడిగా ఉన్న జగన్ ఒక్కసారి కూడా కోర్టు మెట్లెక్కకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను ఐదేళ్లు జైలులో మగ్గిపోయాడు. NIA కి అప్పగించింది. ఈ దాడిలో కుట్ర కోణం లేదని NIA కోర్టుకి నివేదించగా, వైసీపీ మాత్రం కుట్ర ఉందని చివరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈ కేసు వ్యవహారం ఎటూ తేలడం లేదు.
సరిగ్గా మళ్లీ ఎన్నికలప్పుడు దాడి..
2019 ఎన్నికల సమయంలో జగన్ పై కోడికత్తి దాడి සñයි.
2024 ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ పై గులకరాయి దాడి జరిగింది.
ఈ దాడి తర్వాత జగన్ కంటి వద్ద పెద్ద బ్యాండ్ ఎయిడ్ తో కనిపించారు. అలానే ఆయన ప్రచార పర్వం నిర్వహించారు. ఆ దాడిలో గాయపడిన మరో నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మొత్తం కంటికే మాస్క్ వేసేశారు. ఈ దాడి తర్వాత కూడా ఇది కుట్ర అని వైసీపీ వాదించగా, కేవలం సింపతీకోసం ఆడిన డ్రామా అంటూ టీడీపీ వెటకారం చేసింది. ఈ దాడి కేసు కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

టీడీపీ ట్వీట్..
అప్పట్లో కోడి కత్తి, ఆ తర్వాత గులకరాయి, మధ్యలో బాబాయ్ పై గొడ్డలి పోటు అంటూ టీడీపీ వేసిన తాజా ట్వీట్ వైరల్ గా మారింది. కోడి కత్తి ఘటనకు ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ట్వీట్ వేసింది టీడీపీ. జగన్ ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి నేటికి ఏడేళ్ళు అంటూ ట్వీట్ లో వ్యంగ్యాస్త్రాలు విసిరింది. దీని తరువాతే బాబాయ్పై గొడ్డలి పోటు, గులకరాయి సూపర్ హిట్ డ్రామాలు కూడా చూశామంటూ కామెంట్లు పెట్టింది. ఇంకా ఈ కోడికత్తి కమల్ హాసన్ ఎన్ని డ్రామాలు చూపిస్తాడో అంటూ క్వశ్చన్ మార్క్ వదిలేసింది టీడీపీ.
Also read
- Tdp Tweet: కోడి కత్తి.. కమల్ హాసన్.. టీడీపీ ర్యాగింగ్!
- కార్తీక దీపం వెలిగిస్తున్నారా? మర్చిపోకుండా ఈ ఒక్క మంత్రం చదవండి
- నేటి జాతకములు…27 అక్టోబర్, 2025
- అంతులేని సంపద, తిరుగులేని అదృష్టం.. ఇది మెడలో ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో..
- Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..





