పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
బెల్లంకొండ, : పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తరపున ఆయన సోదరి రుద్రమ్మదేవి ఆదివారం సాయంత్రం నాగిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా కార్యకర్తలు, నాయకులు ఆమె నిర్వహించిన ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డుగా ఉంచి తెదేపా శ్రేణులను నిలువరించారు. దీంతో తెదేపా నాయకులు ప్రశ్నించగా వారిపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకొని తెదేపా శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు. స్థానికులు గమనించి తెదేపా నాయకులకు సమాచారం అందించేలోపే అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనపై తెదేపానాయకులు ఎస్సై రాజేష్ కు ఫిర్యాదు చేశారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!