SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

Polling: పోలింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్లపై దాడి



పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు.

రెంటచింతల: పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తున్న క్రమంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు.

ఈసీ ఆగ్రహం

పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

Also read

Related posts

Share this