ఏపీ నెల్లూరులో ఠాగూర్ సినిమా హాస్పిటల్ సీన్ రిపీట్ అయింది. జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది వెంకటేశ్వర్లు డెడ్ బాడీకి స్టంట్ వేస్తున్నట్లు నమ్మించి ఫీజు వసూల్ చేశారు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డిపై దాడి చేశారు.
AP Crime: ఏపీలో దారుణం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సీన్ రిపీట్ అయింది. చనిపోయిన డెడ్ బాడీకి ఆపరేషన్ చేస్తున్నామంటూ అడ్డగొలుగా ఫీజులు వసూల్ చేయడం కలకలం రేపింది. ఒకసారి కాదే ఏకంగా రెండుసార్లు పేషెంట్ కు స్టంట్ వేస్తున్నామంటూ డాక్టర్లు చేసిన దొంగ స్టంట్ బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాకేంద్రలోని ఓ మెడికవర్ మెడికల్ హాస్పిటల్ లో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి
10 నిమిషాలకొక స్టంట్..
ఈ మేరకు టీపీ గూడూర్ వరిగొండ గ్రామానికి చెందిన జానా వెంకటేశ్వర్లు (58) నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అయితే వెంకటేశ్వర్లుకు ఒక స్టంట్ వేయాలని వైద్యులు సూచించారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మరో 10 నిమిషాలకి మరో స్టంట్ వేయాలంటూ డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం వెంటనే డబ్బులు కట్టమని చెప్పడంతో కట్టేశారు. కానీ కాసేపటికి వైద్యులు ఊహించని షాక్ ఇచ్చారు. వెంకటేశ్వర్లు చనిపోయినట్లు తెలిపారు
దీంతో ఒక్కసారిగా కంగుతిన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశాడు. దీంతో వివాదం మొదలవగా వెంకటేశ్వర్లు డాక్టర్ అమర్నాథ్ రెడ్డిపై దాడి చేశారు. అనంతరం ఆస్పత్రిముందు ధర్నాకు దిగారు. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..