తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని వెంటాడి వేట కొడవలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. గత కొంతకాలగా హర్షవర్ధన్, నాగరాజు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి హర్షవర్ధన్ నాగరాజు ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడు. దీంతో నాగరాజు వేటకొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025