పల్నాడు జిల్లా : కోటప్పకొండ వేద పాఠశాలలో ఆగమం శాస్త్రం 4వ ఏడాది చదువుతున్న విద్యార్థి కుందుర్తి సాయి శివ సూరజ్ (16) వసతి గృహం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాల పట్నం గ్రామానికి చెందిన సాయి శివ సూరజ్ అందరితో కలివిడిగా స్నేహంగా మెలిగే వాడని బుధవారం రాత్రి కూడా అందరితో సరదాగా గడిపారని తోటి స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పౌరోహిత్య విద్యను అభ్యసిస్తున్న సాయి శివ సూరజ్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సమాచారం అందుకున్న రూరల్ వేద పాఠశాల వద్దకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రి శవాగారానికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





