– కలశ శోభాయాత్ర నిర్వహించిన శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి.
– కనుల పండుగగా శ్రీగోకులం కోలాట భజన మండలి “కోలాట సంకీర్తనోత్సవం”.




ఒంగోలు::
ఒంగోలు నగరంలోని సీతారామపురం మామిడిపాలెం కొండ “రామగిరి” పై కొలువైన శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానము నందు శ్రీరామనవమి వేడుకలు శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యములో  ఘనంగా ప్రారంభమైనవి. 
పంచాహ్నిక దీక్షతో 13 వతేది నుండి 17వ తేది వరకు ఐదురోజులపాటు జరుగుచున్న శ్రీ రామనవమి వేడుకలు శనివారం శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి ఆధ్వర్యములో జరిగిన “కలశ శోభాయాత్ర” తో ప్రారంభమైనవి.
స్థానిక కేశవస్వామి పేట శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణములోని స్వామి వారి పుష్కరిణి వద్ద ఆలయ అర్చకులు పరాంకుశం రామనాధాచార్యులు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం పుష్కరిణి నుండి 108 కలశములతో అభిషేక జలమును తీసుకొని మహిళలు, అయోధ్య శ్రీ బాలరాముని చిత్ర పటమును చేపూని శ్రీరామ నామాలు చదువుచూ పెద్ద సంఖ్యలో భక్తులు భగిరధ సెంటర్, వేప అంకమ్మ తల్లి, వరాలనాగేంద్ర స్వామి ఆలయముల మీదుగా సీతారామపురం రామగిరి చేరారు. ఆలయ అర్చకులు ముప్పాళ్ల రాంబాబు, వాకాని కోదండ రాంబాబు లు శ్రీసీతారామలక్ష్మణ మరియు హనుమాన్ మూరవిట్టుకు కలశములతో తెచ్చిన జలముతో అభిషేకం నిర్వహించారు. దారిపొడుగునా అయోధ్య సరయు నది జలము మరియు పసుపు కలిపిన నీటితో ట్రాక్టరుద్వారా రహదారిని శుద్ధిచేశారు.
భక్తులు శ్రీరామ మహామంత్ర పఠనముతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమములో గోలి తిరుపతి రావు, లక్ష్మీ కోటేశ్వరమ్మ దంపతులు, ఆలయ సేవా సమితి గౌరవ అధ్యక్షులు శింగంశెట్టి శివరామ కృష్ణ, అధ్యక్షులు మొగిలి ఆనందరావు, కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, సంతవేలూరి కోటేశ్వరరావు, నట్టం పురందరదాసు, గోగు శివుడు, విప్పగుంట రామాంజనేయులు, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి గౌరవ అధ్యక్షులు చలువాది బదరి నారాయణ, అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, సహ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also read
- Andhra News: క్లాస్‌గా వచ్చాడు.. క్లీన్‌గా దోచుకెళ్లాడు.. కట్‌చేస్తే.. ఎలానో తెలిస్తే..
 - కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 





