November 21, 2024
SGSTV NEWS
Spiritual

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.
– అలరించిన డా. పోలూరు కృష్ణవాసు శ్రీకాంత్ నృత్యనగరోత్సవం.

ఒంగోలు::

నగరంలోని సీతారామపురం (మామిడి పాలెం కొండ) “రామగిరి” పై కొలువైన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు పంచాహ్నికదీక్షతో 13వ తేది శనివారము నుండి 17వ తేదీ బుధవారం వరకు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక కేశవ స్వామి పేట శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి కోలాటం, నాద సంకీర్ణోత్సవం, రామనామ సంకీర్ణోత్సవములు రామగిరి శ్రీ సీతారామ స్వామి దేవస్థానం వరకు జరిగాయి.



16వ తేదీ మంగళవారం నరసరావుపేటకు చెందిన భరతనాట్య శిక్షకులు డా. పోలూరి కృష్ణ వాసు శ్రీకాంత్ అన్నమాచార్య, త్యాగరాజు, భక్త రామదాసు ఆలపించిన కీర్తనలకు తమ నృత్య గమనంతో గ్రామోత్సవం, అంకమ్మతల్లి కోలాటభజన బృందం కోలాటం సంకీర్ణోత్సం నగరవాసులను ఆనందడోలికల్లో నిలిపింది.

17వ తేది బుధవారం సాయంత్రం శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని లోకకళ్యాణార్ధం “శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం” ఆలయ కళ్యాణ మండపంలో జరుగునని నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

కార్యక్రమంలో శ్రీ సీతారామ స్వామి దేవాలయ సేవా సమితి అధ్యక్షులు మొగిలి ఆనందరావు ప్రధాన కార్యదర్శి మద్దులూరు శ్రీనివాసులు మరియు కార్యవర్గ సభ్యులు సంత వేలూరు కోటేశ్వరరావు నెట్టం పురందరదాసు గోగు శివుడు విప్పగుంట రామాంజనేయులు మరియు శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటి అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via