SGSTV NEWS
Spiritual

గురువారం గోర్లు, జుట్టు కట్ చేసుకోవడం నిషేధం.. శాస్త్రీయ కోణం ఏమిటంటే..

 
హిందూ మతంలో వారంలోని ఏడు రోజులు ఒకొక్క దేవుడికి, ఒకొక్క గ్రహానికి అంకితం చేయబడింది. అంతేకాదు ఆధ్యాత్మిక గ్రంథాలు జీవితంలో పాటించాల్సిన అనేక నియమాలు పేర్కొన్నాయి. ఏ రోజున ఏది చేయాలి? ఏది చేయకూడదు అనే నియమం పాటించడం వలన జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం. అటువంటి నియమాల్లో గోర్లు, జుట్టు కత్తిరించడం ఒకటి. వారంలో ఒక రోజు గోర్లు, క్షవరం చేయించుకోవడం, జుట్టు కత్తిరించడం ఆశుభమని భావిస్తారు. ఈ నమ్మకం వెనుక గల కారణాల గురించి తెలుసుకుందాం..


హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేయబడింది. ఇంకా ప్రతి రోజుతో ముడిపడి ఉన్న కొన్ని నిర్దిష్టమైన నమ్మకాలు , సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలు శతాబ్దాలుగా ప్రబలంగా ఉన్నాయి. నేటికీ ప్రజలు ఈ సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ సంప్రదాయాలలో ఒకటి గురువారం జుట్టు కత్తిరించకపోవడం. ఆధ్యాత్మిక గ్రంథాల్లో గురువారం జుట్టు కత్తిరించడం, గడ్డం చేసుకోవడం, గోర్లు కత్తిరించడం అశుభమని పేర్కొన్నాయి.

అందుకే నేటికీ ఇళ్లలో పెద్దలు గురువారం జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం లేదా గోర్లు కత్తిరించడం వంటి పనులు చేస్తుంటే వద్దని వారిస్తారు. అయితే గురువారం జుట్టు కత్తిరించడం, క్షవరం చేయడం, గోర్లు కత్తిరించడం ఎందుకు నిషేధించబడింది? దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం..

ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి?
హిందూ మతంలో గురువారం విశ్వ రక్షకుడైన శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజును దేవతల గురువు అయిన బృహస్పతి రోజుగా కూడా పరిగణిస్తారు. నమ్మకాల ప్రకారం, గురువారం నాడు జుట్టు లేదా గోళ్లను కత్తిరించుకుంటే విష్ణువు అనుగ్రహం దక్కదని నమ్మాకం. అంతేకాదు ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లను కత్తిరించడం కూడా దేవ గురువు బృహస్పతికి అసంతృప్తికి గురి చేస్తుంది.


ప్రతికూల శక్తికి సంబంధించిన నమ్మకాలు
జీవితంలో అడ్డంకులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు తలెత్తుతాయి. హిందూ మతంలో గురువారం పవిత్రమైన, శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శారీరక , మానసిక స్వచ్ఛత చాలా అవసరం. మరోవైపు జుట్టు, గోర్లు వంటి వాటిని శారీరక వ్యర్థాలను అపవిత్రంగా భావిస్తారు. కనుక వీటిని కత్తిరించడం శరీర స్వచ్ఛతకు భంగం కలిగిస్తుందని నమ్ముతారు. కనుక ఈ రోజున గోర్లు , వెంట్రుకలను కత్తిరించడం అశుభకరమని చెబుతారు.

శాస్త్రీయ కారణం
గురువారం నాడు జుట్టు, గోళ్లను కత్తిరించుకోవద్దు అని చెప్పడం కేవలం మతపరమైన కారణం మాత్రమే కాదు.. శాస్త్రీయమైనది కూడా. చేతివేళ్లు చాలా సున్నితమైనవి. అవి గోళ్ల ద్వారా రక్షించబడతాయి. గురువారం నాడు విశ్వం నుంచి వెలువడే అనేక సూక్ష్మ కిరణాలు మానవ శరీరంలోని సున్నితమైన భాగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కట్టించుకోవడం వంటి పనులు నిషేధించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు

Also read

Related posts