వింతలు, విశేషాలు, అద్భుతాలకు భారతదేశంలోని దేవాలయాలు ఆనవాళ్ళుగా కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా పురాతన ఆలయాల్లో ఏదో ఒక విజ్ఞానానికి సంబంధించిన రహస్యాలు నిగూఢంగా దాగుంటాయి. ఆ ఆలయాలలోని రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, చారిత్రక పరిశోధకులు విశేషంగా కృషి చేస్తుంటారు. అయితే నేటికీ సైన్స్ కు అందని వింతలు, విశేషాలు, రహస్యాలు ఉన్న ఆలయాలు, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ దేవాలయం చుట్టూ పక్షులు ప్రదక్షిణలు చేశాయి. ఈ ఘటనను భక్తులు స్థానికులు వింతగా చూశారు.
దేశంలో ప్రసిద్ది చెందిన ఆలయ నిర్మాణాలను వేద కాలం నుంచే ఎంతో ఆధునిక ఆర్కిటెక్ట్ విధానాలతో రూపొందించిన విశేషాలు అప్పుడప్పులు వెలుగులోకి వస్తుంటాయి. ఆనాటి నిర్మాణ కళా వైభావాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఇదే కోవలో ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాథస్వామి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం పైనుంచి పక్షులు ఎగరవు. దీన్ని ఒక వింతగా చెప్పుకుంటారు. అయితే మిగిలిన దేవాలయాల దగ్గర మాత్రం పక్షులు ఎప్పుడు సందడి చేస్తుంటాయి. కొన్ని దేవాలయాల దగ్గర పక్షుల రాకను విశేషంగా చెప్పుకుంటారు. అలాంటి విశేషం గురించే ఇప్పుడు ప్రకాశంజిల్లా మార్కాపురంలోని శ్రీలక్షీ చెన్నకేశవస్వామి దేవాలయం దగ్గర జరిగిన ఓ ఘటన గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.
ప్రకాశంజిల్లా మార్కాపురంలో పక్షుల సందడి పట్టణవాసులకు కనువిందు చేసింది. పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన రాయలవారి నాటి కాలంలో నిర్మించిన పురాతన దేవస్థానం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద పక్షులు వింతగా ప్రవర్తించాయి. ఆలయ ప్రధాన గాలిగోపురం చుట్టూ తిరుగుతూ సందడి చేశాయి. వాటిని గమనించిన స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గోపురం చుట్టూ పక్షులు చేస్తున్న ప్రదక్షిణ దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కార్తీక మాసంలో దేవాలయాల్లో జరిగే విశేష పూజలు, వేదమంత్రాలకు ఆకర్షితులైన పక్షలు ఇలా చక్కర్లు కొడతాయని భావిస్తున్నారు. కాదు కాదు ఇదంతా దేవుడి మహిమే అంటూ కొందరు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో దేవాలయం గాలిగోపురం చుట్టూ పక్షులు ప్రదక్షిణలు చేసిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





