హిందూ మతంలో పండుగలు, ఉపవాసాల తర్వాత దానం చేసే సంప్రదాయం ఉంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం నూనె-ఉప్పు, మిగిలిపోయిన ఆహారం, చీపుర్లు, ఆధ్యాత్మిక పుస్తకాలు దానం చేయడం వల్ల ఆర్థిక నష్టం, అనారోగ్యం, కుటుంబంలో దుఃఖం, ప్రతికూల పరిణామాలు వస్తాయి. ఇటువంటి విరాళాలు పుణ్యాన్ని తగ్గించడమే కాదు.. దాత జీవితంలో సమస్యలను కూడా సృష్టిస్తాయి. కనుక ఈ వస్తువులను దానం చేయవద్దు.
పండుగలు, ఉపవాసాల తర్వాత దానధర్మాలు చేయడం హిందూ మతంలో ఒక సాంప్రదాయ ఆచారం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దానం చేసేటప్పుడు మీరు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు. దీనివల్ల ఆర్థిక సమస్యలు, దుఃఖం, ప్రతికూల పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక కొన్ని వస్తువులను పండగలు, ఉపాసం చేసి దానం చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
👉 నూనె – ఉప్పు: ఉపవాసం లేదా పండుగల తర్వాత దానం చేయాలని ఒక నియమం ఉంది. అయితే వాస్తు ప్రకారం ఏదైనా ఉపవాసం ముగిసిన తర్వాత నూనె లేదా ఉప్పు దానం చేయకూడదు. దీని కారణంగా దానం చేసిన పుణ్యంతో పాటు ఉపవాసం చేసిన ఫలితం కూడా పోతుంది. ఆర్థిక నష్టం, అనారోగ్య భయం మిమ్మల్ని వెంటాడుతాయని అంటారు. కనుక దానం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.
👉 మిగిలిపోయిన ఆహారం: ఇంటికి ఆహారం కోసం వచ్చే యాచకులకు మిగిలిపోయిన లేదా చెడిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ దానం చేయకండి. ఇది ఇంట్లో సంపద , శ్రేయస్సును నిరోధిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతే కాదు ఇది కుటుంబంలో పేదరికం, అనారోగ్యం, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా ఇచ్చే ఆహారం ఎల్లప్పుడూ తాజా , శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే దానం చేయాలని చెబుతారు.
👉 చీపురు: చీపురును ఎవరికీ దానం చేయకూడదు. దీనిని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. చీపురును దానం చేయడం వల్ల ఆర్థిక నష్టం, సంపద లేకపోవడం జరుగుతుంది. అందుకే చీపురును ఎవరికీ ఎప్పుడూ ఇవ్వకూడదని అంటారు.
👉 ఆధ్యాత్మిక పుస్తకాలు: ఇంటికి వచ్చే వారికి ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా గ్రంథాలను దానంగా ఇవ్వ వద్దు. గ్రహీత దానిని పవిత్రంగా ఉంచకపోతే లేదా చదవకపోయినా దాత పాపానికి గురవుతాడు. దీని వలన జీవితంలో అడ్డంకులు, నిరాశలు, ప్రయత్నాలలో వైఫల్యాలు ఎదురవుతాయి. కనుక ఇటువంటి దానాలు అపాత్రులకు చేయవద్దు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





