వైకుంఠ ఏకాదశి తిధి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన తిధి. హిందూ మతంలో ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి దేవుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం, ఉపవాసం చేయడంతో పాటు దానధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. ఈ రోజు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం.
హిందూ మతంలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజు శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం, పూజలు చేసిన వారికి మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలు నశిస్తాయని శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు అంటే జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం, వైకుంఠ ఏకాదశి ఉపవాసం జనవరి 10 న ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడంతో పాటు దానధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. కనుక వైకుంఠ ఏకాదశి రోజున ఏయే వస్తువులు దానం చేయడం శుభ ప్రదమో తెలుసుకుందాం.
ఏ వస్తువులను దానం చేయాలంటే..
వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నం, బట్టలు, డబ్బు దానం చేయడం శుభప్రదం అని నమ్మకం. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
ఈ రోజున తులసి మొక్క, దుప్పటి, ధాన్యాన్ని కూడా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వలన పుణ్యం కలుగుతుందని.. శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
ఈ రోజున గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల సకల సిరి సంపదలు లభిస్తాయని.. సమాజంలో గౌరవం లభిస్తుందని నమ్మకం.
ఏ పనులు చేయవద్దంటే
వైకుంఠ ఏకాదశి రోజున మనసులో ప్రతికూల ఆలోచనలు చేయవద్దు.
ఈ రోజు అబద్ధం చెప్పకూడదు.
ఈ రోజు కోపం తెచ్చుకోకూడదు.
ఈ రోజున మాంసాహారం తినకూడదు.
ఈ రోజున ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోవద్దు.
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత
వైకుంఠ ఏకాదశి రోజు మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండడం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయి. మనస్సు స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి. అంతే కాదు ఆనందం , సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి. ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారు మోక్షం లభిస్తుదని.. స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం. మరణానంతరం మరు జన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠ ధామంలో స్థానం పొందుతారని నమ్మకం
Also Read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





