ఒంగోలు::
ఫాల్గుణ మాసం చతుర్దశి, పౌర్ణమి తిధులైన మార్చ్ 24, 25 తేదీలలో శ్రీ రాధా మాధవ కళ్యాణం సాంప్రదాయ భజన పద్ధతిలో స్థానిక దేవుని మాన్యం, ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు శ్రీ రాధాకృష్ణ ఆశ్రమం నిర్వాహకులు బ్రహ్మచారి వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు వివరాలు తెలుచూ… 24వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గణపతి పూజ, కలశ స్థాపన, తోడై మంగళం, జయదేవ అష్టపదులు, పంచపది, దివ్య నామం, దీప ప్రదక్షిణ మరియు డోలోత్సవం జరుగునని, 25వ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉంచ వృత్తి, తదుపరి శ్రీ రాధా మాధవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ లోకనాధుని కళ్యాణానికి భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తదుపరి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు.
Also read
- పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..? అసలు రహస్యం ఇదే!
- July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- మిస్టరీ బ్లాస్టర్.. నిప్పు లేదు.. సిలిండర్ పేలలేదు.. కానీ కిచెన్లో భారీ పేలుడు! భయాందోళనలో జనం!
- Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
- Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!




