SGSTV NEWS
CrimeUttar Pradesh

బాలుడి కలలో కనిపించిన పరమశివుడు.. తెల్లారేసరికల్లా అంతా షాక్..!



ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన గ్రామంలో ఒక స్థలాన్ని తవ్వారు. ఎందుకంటే అతనికి రాత్రి ఒక కలలో పరమశివుడు కనిపించాడని చెప్పాడు. శివుడు స్వయంగా అతనికి కలలో కనిపించి, అక్కడ రెండు శివలింగాలు ఉన్నాయని చెప్పి ఆ ప్రదేశాన్ని చూపించాడని తెలిపాడు.
బాలుడి కలలో కనిపించిన పరమశివుడు.. తెల్లారేసరికల్లా అంతా షాక్..!

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన గ్రామంలో ఒక స్థలాన్ని తవ్వారు. ఎందుకంటే అతనికి రాత్రి ఒక కలలో పరమశివుడు కనిపించాడని చెప్పాడు. శివుడు స్వయంగా అతనికి కలలో కనిపించి, అక్కడ రెండు శివలింగాలు ఉన్నాయని చెప్పి ఆ ప్రదేశాన్ని చూపించాడని తెలిపాడు. మరుసటి రోజు ఉదయం ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి ఆ ప్రదేశాన్ని తవ్వినప్పుడు, నిజంగానే అక్కడ రెండు శివలింగాలు కనిపించాయి.

ఈ వార్త గ్రామం అంతటా దావానంలా వ్యాపించింది. శివలింగాలు బయటపడ్డ స్థలంలో జనసమూహం పెరిగిపోయింది. ప్రత్యేక పూజలు చేసి, జలాభిషేకం చేయడం ప్రారంభించారు. ఈ సంఘటన బదౌన్‌లోని ఒక చిన్న గ్రామమైన మీర్జాపూర్ మొహ్సాన్‌పూర్‌లో జరిగింది. గ్రామంలో నివసించే ఉమేష్ పొలంలో భూమి నుండి ఒక శివలింగం ఉద్భవించిందని స్థానికులు తెలిపారు.

ఉమేష్ 14 ఏళ్ల కుమారుడు అఖిలేష్ ప్రకారం, అతనికి శుక్రవారం (సెప్టెంబర్ 26)నాడు తన పొలంలో శివలింగం ఉందని కల వచ్చింది. అప్పుడు అతను దానిపై దృష్టి పెట్టలేదు. కానీ సోమవారం, అతనికి మళ్ళీ అలాంటి కలనే వచ్చింది. తన పొలంలో శివలింగం ఉందని శివుడు తన కలలో చెప్పాడని తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఈసారి, అతను ఆప్రదేశంలో తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అఖిలేష్ తన ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేశాడు. ముగ్గురూ తమ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా మళ్ళీ పొలంలో తవ్వడం ప్రారంభించారు. అకస్మాత్తుగా, వారు పొలంలో రెండు శివలింగాలను కనుగొన్నారు. ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించిన వెంటనే, అక్కడికి పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు.

ప్రజలు దీనిని దేవుని మహిమగా భావించి పూజించడం ప్రారంభించారు. గ్రామంలోని కొంతమంది శివ భక్తులు కన్వర్లను తీసుకువచ్చి జలాభిషేకం కూడా చేశారు. శివలింగం బయటపడిన వార్త తెలియగానే, ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి శివ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూజలు, అభిషేకాలతో ఆప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు.

Also read

Related posts