SGSTV NEWS
Spiritual

Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..





ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొదటి జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సోమనాథ ఆలయానికి శ్రావణ మాసంలో భక్తులు బారులు తీరతారు. భక్తుల సౌకర్యార్ధం అనేక సదుపాయాలను కల్పిస్తున్నారు ఆలయ సిబ్బంది. అయితే సోమనాథ ఆలయానికి వెళ్ళలేని భక్తుల కోసం ఒక ప్రత్యేక మతపరమైన సేవను తిరిగి ప్రారంభిస్తుంది. దీనిలో ఏ భక్తుడైనా కేవలం 25 రూపాయలు చెల్లించడం ద్వారా రుద్రాక్షను పొందవచ్చు. అంతేకాదు భక్తుని పేరు మీద శివయ్యకు బిల్వ పత్రాన్ని కూడా సమర్పించనున్నారు.


గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ ఆలయం శ్రావణ మాసంలో భక్తుల కోసం మళ్ళీ ఒక ప్రత్యేకమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇప్పుడు భక్తులు కేవలం రూ. 25 రుసుముతో పవిత్ర రుద్రాక్షను పొందవచ్చు. అంతేకాదు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే బిల్వపత్రాన్ని శివునికి సమర్పించనున్నారు. ఆలయ పరిపాలన సిబ్బంది చేసిన ఈ కొత్త ఏర్పాటుతో భక్తులకు శివుని పట్ల తమ భక్తిని వ్యక్తపరచడానికి సులభమైన, అందరికీ అందుబాటులో ఉండే మార్గాన్ని అందిస్తున్నట్లు అయింది. సోమనాథుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్నందున.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, ఆధ్యాత్మిక అనుభవాలను పెంపొందించడంపై ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.


శ్రావణ మాసంలో శివుడికి బిల్వపత్రం సమర్పించడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి రావాలని కోరుకుంటారు. అయితే ఆలయంలో ఉండే రద్దీ లేదా ఇతర కారణాల వల్ల భక్తులు ఆలయానికి చేరుకోవడానికి లేదా పూజించడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు భక్తులు ఎటువంటి ఆందోళన లేకుండా తమ పేరు మీద బిల్వపత్రాన్ని సమర్పించగలరు. అటువంటి పరిస్థితిలో ట్రస్ట్ వెబ్‌సైట్‌లో ( https://somnath.org/BilvaPooja/Shravan ) ఆన్‌లైన్ సౌకర్యం కల్పించబడింది. భక్తులు దేవుని పూజ కోసం బుక్ చేసుకోవచ్చు.

సోమనాథ్ ఆలయ చొరవ?



సోమనాథ్ ట్రస్ట్ ప్రారంభించిన ఈ సేవ కింద.. భక్తులు ఆన్‌లైన్‌లో లేదా ఆలయ ప్రాంగణంలో కేవలం 25 రూపాయలు చెల్లించి రుద్రాక్షను పొందవచ్చు. ఇది మాత్రమే కాదు ట్రస్ట్ భక్తుడి పేరు, గోత్రంతో శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తుంది. అంతేకాదు సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ట్రస్టీ జె.డి. పర్మార్ కూడా శ్రావణ మాసంలో 2025 కోసం బిల్వపత్ర పూజను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సోమనాథ మహాదేవ పూజను పూజారి నిర్వహిస్తారు. ఈ సేవను 2023 నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శ్రావణ మాసాలలో భక్తుల కోసం ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని చెప్పారు. శ్రావణ మాసంలో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు సోమనాథుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలని కోరుకుంటారు. అయితే అనేక కారణాల వల్ల చాలా మంది భక్తులు ఇక్కడికి చేరుకోలేకపోతున్నారు.

భక్తులకు భారీ సౌకర్యాలు

ఆలయంలో శివుడికి బిల్వపత్రం సమర్పించలేని భక్తులకు చాలా ఈజీ అవుతుంది. అంతేకాదు శివుడి ప్రసాదంగా రుద్రాక్షలను భక్తులకు పంపించడం ద్వారా శివుని ఆశీస్సులను అందుకుంటారు. ఈ ఆలయాన్ని భక్తులతో అనుసంధానించడానికి, భక్తులను ఆధ్యాత్మికంగా శక్తివంతం చేయడానికి ఈ దశ ఒక ముఖ్యమైన ప్రయత్నం.

ఇది ఎందుకు ప్రత్యేకమైన బహుమతి?

ఈ సమర్పణ ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఆర్థికంగా అత్యంత అందుబాటులోకి తీసుకురావడం వల్ల కూడా ప్రత్యేకమైనది. రుద్రాక్ష వంటి పవిత్ర వస్తువును భక్తులు పొందడం, మీ పేరుతో బిల్వపత్రాన్ని కేవలం ₹25 కి సమర్పించే అవకాశం లభించడం ఒక ప్రత్యేక విషయం. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ విశ్వాసం ప్రకారం దేవుడిని సేవించవచ్చు. భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ ఆలయం చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. భక్తుల సౌలభ్యం కోసం ఆలయ పరిపాలన ఎప్పటికప్పుడు వివిధ చర్యలు తీసుకుంటోంది. శ్రావణ మాసంలో ఆలయ అధికారులు చేపట్టిన ఈ ప్రత్యేక కార్యకమం ద్వారా ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఖచ్చితంగా ఒక చిరస్మరణీయ అనుభవంగా ఉంటుంది. వారిని శివుడికి దగ్గర చేస్తుంది.

సనాతన ధర్మంలో ప్రాముఖ్యత

బిల్వపత్రం, రుద్రాక్షలను శివుడికి చాలా ప్రియమైనవిగా భావిస్తారు. స్కందపురాణం, శివమహాపురాణంలో ఈ రెండింటిని శివ పూజలో ఉపయోగించడం చాలా పుణ్యప్రదమని చెప్పబడింది. ముఖ్యంగా శ్రావణ మాసంలో, వాటి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. రుద్రాక్ష ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, పాపాలు నశించిపోతాయని, శివుని ఆశీస్సులు లభిస్తాయని మతపరమైన నమ్మకం ఉంది. ఈ చొరవ కారణంగా దేశవ్యాప్తంగా భక్తులు ఈ సేవను సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా చర్చ జరుగుతోంది. ఇంత తక్కువ మొత్తంలో ఇంత అర్థవంతమైన సేవను పొందడం నిజంగా అద్భుతం అని భక్తులు చెబుతున్నారు.

Related posts

Share this