కాకినాడ జిల్లా గడ్డిపేటలో దారుణ హత్య కలకలం రేపుతోంది. వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన సహచరుడి గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు బీహార్ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిపేట గ్రామంలో దారుణ హత్య కలకలం రేపుతోంది. వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన సహచరుడి చేతిలోనే గొంతుకోసి హత్యకు గురైన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతుడిని మన్యం జిల్లా ప్రాంతానికి చెందిన శెట్టి వెంకట నాయుడుగా పోలీసులు గుర్తించారు. వెంకట నాయుడు ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని లైఫస్ అనే ప్రైవేట్ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతడు రామారావుపేట ప్రాంతంలో మరో ఇద్దరు వెల్డర్లతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడు. వారిలో ఒకరు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా, అదే వ్యక్తి వెంకట నాయుడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సెల్ ఫోన్ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ క్రమంగా పెరిగి దాడికి దారితీసింది. బీహార్ అనే వ్యక్తి కత్తితో వెంకట నాయుడి గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వారు చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన ఇల్లు, పరిసరాలను పూర్తిగా తనిఖీ చేశారు.
హత్యకు గల ప్రధాన కారణం సెల్ ఫోన్ వివాదమేనని పోలీసులు స్పష్టంచేశారు. గత మూడు నెలలుగా మృతుడు హంతకుడితో కలిసి జీవిస్తున్నట్టు తెలుస్తోంది. హత్య అనంతరం హంతకుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన తొండంగి సీఐ చెన్నకేశవరావు..సెల్ ఫోన్ గొడవ కారణంగా హత్య జరిగినట్లు అనుమానిస్తున్నాం. కేసు వివరంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Also read
- నేటి జాతకములు 14 జూలై, 2025
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంతలో