వార ఫలాలు (నవంబర్ 23-29, 2025): మేష రాశి వారు ఈ వారం కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మెరుగ్గా సాగిపోతుంది. భారీ లక్ష్యాలను సైతం సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారు జీవిత భాగస్వామితో తొందరపాటుతో వ్యవహరించకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
బంధుమిత్రులతోనే కాక, ప్రేమ వ్యవహారాల్లో కూడా మీ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టే ఆలోచనలు కూడా చేస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం సాధించడం కోసం, పురోగతి చెందడం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి ప్రాధాన్యం పెరుగుతుంది. విలాస జీవితం మీద బాగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ప్రస్తుతం బుధుడు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఉద్యోగ జీవితం మెరుగ్గా సాగిపోతుంది. భారీ లక్ష్యాలను సైతం సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల ఒత్తిడి, గడువు కాలాలు ఉండకపోవచ్చు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి చిన్నాచితకా ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వర్తమానం మాత్రమే కాక భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొందరు ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లలు, బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు కారణంగా ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గడంతో పాటు, ఆశించిన ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి ప్రయత్నాలు సాగిస్తారు. వ్యాపారాల్లో డిమాండ్ ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. శుక్ర, బుధుల అనుకూలత వల్ల వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో కుజుడి స్థితి వల్ల బంధుమిత్రులతో కొద్దిగా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో తొందరపాటుతో వ్యవహరించకపోవడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరు బాగా మెరుగుపడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కుజుడి స్థితి కారణంగా ఉద్యోగంలో ఊహించని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కొద్ది ప్రయత్నంతో లాభాల పంట పండించుకోవడానికి వీరికి అవకాశాలు లభిస్తాయి. గురువు అనుకూలత వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. శనీశ్వరుడి కారణంగా వ్యక్తిగత జీవితంలోనూ, బంధుత్వాలలోనూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలను తగ్గించుకోని పక్షంలో కుటుంబంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సాధక బాధ కాలను పంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
శనీశ్వరుడి అష్టమ స్థితి వల్ల ఉద్యోగ వాతావరణం ఆశించినంత సాఫీగా, సానుకూలంగా ఉండక పోవచ్చు. సహోద్యోగులు కూడా ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బుధుడి కారణంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నష్టదాయక వ్యవహారాలకు స్వస్తి చెప్పడం జరుగుతుంది. వారమంతా ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా మొదట్లో ఆటంకాలు ఎదురవుతాయి కానీ, చివ రకు అంతా సుఖాంతం అవుతుంది. శుక్రుడి అనుకూలత కారణంగా దాంపత్య జీవితమే కాక, ప్రేమ జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఈ వారమంతా కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. బంధుమిత్రులతో మాత్రం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయ ప్రయత్నాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నా వారాంతంలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో లక్ష్యాలను, బాధ్యతలను పెంచే అవకాశం ఉంది. పని ఒత్తిడి, పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగానే ఉంటుంది. ఇక ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు, కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడి అనుకూలత కారణంగా ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోవడం, కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడం, ఆర్థికంగా పురోగతి ఉండడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం వంటివి జరిగే అవకాశం ఉంది. స్నేహాలు, బంధుత్వాలు కూడా బాగా మెరుగ్గా సాగిపోతాయి. కుజుడి అండ కూడా లభించడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సృజనాత్మకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతోనే కాక, సహోద్యోగులతో కూడా సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు తప్ప కుండా శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
శుక్ర గ్రహం బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల వారమంతా కుటుంబ జీవితం, దాంతప్య జీవితం, ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతాయి. భాగ్య స్థానంలో గురువు సంచారం ఆర్థిక విషయాలకు బాగా అనుకూలంగా ఉంది. సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ వల్ల ఆర్థిక వ్యవహారాలు బాగా మెరుగుపడతాయి. కుజుడి స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. బుధుడి కారణంగా నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో సీనియర్ల నుంచి, సహోద్యోగుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. బాధ్యతలను, లక్ష్యాలను తేలికగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా సాగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం, ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. బంధుత్వాలు మెరుగుపడతాయి. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శనీశ్వరుడి స్థితి వల్ల అన్ని విషయాల్లోనూ రాజీమార్గాన్ని అనుసరించడం, చూసీచూడనట్టు పోవడం చాలా మంచిది. ఉద్యోగంలో అధికారులతో లౌక్యంగా వ్యవహరించడం అవసరం. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో గానీ, వ్యాపారాల్లో గానీ భారీగా పెట్టుబడులు బంధుమిత్రులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం అవసరం. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా అనుకున్నవి సాధిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని కారణంగా వ్యక్తిగత, ఆర్థిక పురోగతి నిదానంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాల్లో వారమంతా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. శుక్ర, కుజుల కలయిక వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ప్రేమ ప్రయత్నాల్లోనూ, దాంపత్య జీవితంలోనూ కొత్త పుంతలు తొక్కుతారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎటువంటి సవాళ్లు ఎదురైనా తేలికగా ఎదుర్కొంటారు. కాస్తంత క్రియాశీలంగా వ్యవహరించే పక్షంలో ఆదాయం బాగా వృద్ధి చెందడం, ఉద్యోగంలో పురోగతి సాధించడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
పరిస్థితులకు, అవసరాలకు తగ్గట్టుగా మారడం మంచిది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడం వల్ల లాభం కలుగుతుంది. ఆదాయ అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త ఆర్థిక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. ఉద్యోగంలో మీ సమర్థత, నైపుణ్యాలు మరింతగా వృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి శీఘ్రగతిన కోలుకుంటారు. కొత్త ఉద్యోగావకాశాలను, అనుకూలంగా ఉన్న పెళ్లి ప్రయత్నాలను వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అనుకోకుండా ఒకటి రెండు కీలక శుభవార్తలు వింటారు.
ఇవి కూడ చదవండి
- Ichchapuram: రజస్వల అయిన బాలిక.. 2 ఏళ్లుగా ఇంట్లోనే చీకటి గదిలో.. అధికారులు వెళ్లి చూడగా..
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- Mahbubnagar: కూతురి కులాంతర ప్రేమ.. తట్టుకోలేక తండ్రి బలవన్మరణం.
- లంకె బిందెల బంగారం అంటూ తక్కువ ధరకే అంటగట్టేందుకు యత్నం.. ఇంతలోనే ట్విస్ట్!
- Hyderabad: మూడు రోజుల్లో పెళ్ళి.. చెరువు కట్టపై విగతజీవిగా పడి ఉన్న యువకుడు..!
- Hyderabad : జాజ్ చేయాలని భర్త, ప్రెగ్నెన్సీ కావడం లేదని అత్త వేధింపులు.. పాపం చివరికి!
- పాఠశాల నిర్మాణ పనుల్లో అపశ్రుతి – క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు మృతి
- మార్గశిర మాసం.. ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేస్తే.. ఇంట్లో కనక వర్షం కురిసినట్టే..
- నేటి జాతకములు…22 నవంబర్, 2025










