చాలామంది సైకత శిల్పాలు అలాగే సైకత రూపాలను చేసేవారు నదీ తీరాలలో లేదా సముద్ర తీరాల వద్ద వాటిని చేసి ప్రశంసలు పొందుతూ ఉంటారు. అలాంటి ఒక సైకత శిల్పి దక్షిణ కాశీగా పేరు పొందిన పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద పారే పంచమనది ఒడిలో సైకత శివలింగాన్ని చేసి అందరి మన్ననలు పొందారు. పారే నీటి మధ్యలో ఇసుకతో చాలా అద్భుతంగా ఆ సైకత శిల్పాన్ని రూపొందించారు.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల పంచమనది మధ్యలో ఇన్ టాక్ సభ్యుడు కడిమెల్ల రాఘవేంద్ర వర్మ అద్భుతమైన సైకత శివలింగాన్ని రూపొందించారు. పారే నీటి మధ్యలో ఇసుకను చేకూర్చి దానితో శివలింగాన్ని చేసి అందరి మన్ననలు పొందారు. కార్తీక మాసం సందర్భంగా దక్షిణ కాశీగా పిలవబడే పుష్పగిరి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఐదు నదులు కలిసే ఈ పంచమ నది లో స్నానం చేసి చెన్నకేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయి అని నమ్మకం. అంతేకాక అరుణాచలంలో గిరి ప్రదక్షణ ఎలా చేస్తారు పుష్పగిరిలో కూడా అలా గిరి ప్రదక్షిణ ఉంటుంది. అలాంటి ఈ పుణ్యక్షేత్రం సమీపంలోని పంచమనది మధ్యలో రాఘవేంద్ర వర్మ సైకత శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి పూజలు చేయడం తో భక్తులందరూ ఆయనను అభినందించారు.
పారే నీటి మధ్య ఇలా సైకత లింగాన్ని చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది శివుని అనుమతి లేనిదే చీమైనా కొట్టదు అన్నట్లుగా శివుని అనుమతితోనే పారుతున్న నీటి మధ్యలో సైకత లింగాన్ని రూపొందించారు. ఈ శివలింగం భక్తులకు కనువిందు చేసింది. తాము సైకత శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టం అని అక్కడి భక్తులు అంటున్నారు. ఏది ఏమైనా నీటి మధ్యలో సైకత లింగాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పువ్వులతో పూజలను చేశారు
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో