July 2, 2024
SGSTV NEWS
Spiritual

మిస్టీరియస్ టెంపుల్.. ఆలయంలో రాత్రి తిరిగే అమ్మవారు.. విగ్రహ పాదాలపై ప్రతిరోజూ దుమ్ము

ప్రతిరోజూ రాత్రి ఆలయంలో కాళికాదేవి తిరుగుతుందని స్థానిక ప్రజలు, ఆలయ పూజారులు చెప్పారు. రాత్రి వేళల్లో అమ్మవారు గుడిలోపలికి వెళ్లే శబ్దం అంటే పాదాల చప్పుడు కూడా వినిపిస్తుందని కొందరు అంటారు. ఆలయ పూజారులు రోజూ ఉదయం ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు ఆలయంలో కాళికాదేవి  పాదాలపై ధూళి కనిపిస్తుందని.. రోజు పాదాలను శుభ్రం చేస్తామని కూడా చెప్పారు.

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల వాస్తుశిల్పం మాత్రమే ఆకర్షణీయంగా ఉండటమే కాదు అనేక ఆలయాలు రహస్య సంఘటనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాల్లో కొన్ని అద్భుత సంఘటనలు జరుగుతాయి. వీటి రహస్యం నేటికీ ఛేదించలేదు. పశ్చిమ బెంగాల్‌లో కాళి దేవి ఆలయం ఒకటి ఉంది. అక్కడ జరిగే అద్భుతాన్ని చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్య పడాల్సిందే. ఈ కాళి దేవి దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ఉంది. ఆ దేవాలయం పేరు జాయ్ శ్యాంసుందరి కాళీ మందిర్ జిబంట కాళి.

ఆలయంలో అమ్మవారు తిరుగుతున్నారా

ప్రతిరోజూ రాత్రి ఆలయంలో కాళికాదేవి తిరుగుతుందని స్థానిక ప్రజలు, ఆలయ పూజారులు చెప్పారు. రాత్రి వేళల్లో అమ్మవారు గుడిలోపలికి వెళ్లే శబ్దం అంటే పాదాల చప్పుడు కూడా వినిపిస్తుందని కొందరు అంటారు. ఆలయ పూజారులు రోజూ ఉదయం ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు ఆలయంలో కాళికాదేవి  పాదాలపై ధూళి కనిపిస్తుందని.. రోజు పాదాలను శుభ్రం చేస్తామని కూడా చెప్పారు.

విగ్రహంలో కదలిక

పూజ సమయంలో కాళికాదేవి విగ్రహంలో కదలిక కనిపిస్తుందని పూజారులు, భక్తులు కూడా చెప్పారు. విగ్రహంలోని కదలికల చూసిన వారికి విగ్రహం సజీవంగా ఉన్నట్లే అనిపిస్తుందని అంటారు.

భక్తుల దుఃఖం చూస్తే కన్నీరు పెట్టుకునే విగ్రహం

ఈ ఆలయంలోని కాళికాదేవి విగ్రహం ముందు ఎవరైనా ఏడిస్తే అప్పుడు కాళికాదేవి విగ్రహం భిన్నంగా కనిపించడం ప్రారంభిస్తుందని ఇక్కడి పూజారులు, భక్తులు నమ్ముతారు. భక్తుల దుఃఖాన్ని చూసి అమ్మవారు కూడా కన్నీరు పెట్టుకున్నట్లు అనిపిస్తుందని చెబుతారు.

పురాణశాస్త్రం

కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రసాదంగా ముడి బియ్యం, అరటిపండ్లను సమర్పిస్తారు. ఈ బియ్యం,  అరటిపండు నైవేద్యానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. దీని ప్రకారం ఒక రోజు ఒక చిన్న అమ్మాయి పూజారిని బియ్యం, అరటిపండ్లు అడిగితే పూజారి నిరాకరించాడు. ఆ రోజు రాత్రి పూజా సమయంలో ఆలయం వద్దకు పూజారి వచ్చే సమయానికి అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయింది. అప్పుడు ఆ చిన్నారి అక్కడికి వచ్చి మళ్లీ పచ్చి బియ్యం, అరటిపండు అడగడం మొదలు పెట్టింది. ఇదంతా అమ్మవారి మహిమ అంటూ ఆ రోజు నుంచి అమ్మవారికి భక్తులు బియ్యం, అరటిపండు కానుకగా సమర్పించే సంప్రదాయం మొదలైందని నమ్మకం.

Also read

Related posts

Share via