స్త్రీలు తల స్నానం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. మహిళలు ఏ రోజున తల స్నానం చేయాలి? ఏ రోజున తల స్నానం చేయకూడదో తెలుసుకోవాలి. అయితే ఈ నియమాలు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ రోజు స్త్రీలు తల స్నానం ఏ రోజున చేయడం శుభప్రదం.. ఏ రోజున తల స్నానం చేయడం దురదృష్టాన్ని తెస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..
హిందూ మతంలో మహిళలు తల స్నానం చేసే విషయంలో కొన్ని నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. దీని ప్రకారం కొన్ని రోజులు తల స్నానం చేయడం శుభప్రదం కాగా మరి కొన్ని రోజులు అశుభకరంగా పరిగణించబడుతుంది. ఈ నమ్మకాలు సాంప్రదాయకమైనవి. వివిధ ప్రాంతాలు, కుటుంబాలకు అనుగుణంగా మారవచ్చు. కొంతమంది ఈ ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తారు. మరికొందరు వాటిని అస్సలు పట్టించుకోరు. అవసరం లేదా పరిశుభ్రత వంటి వివిధ కారణాల వలన వ్యక్తులు ఏ రోజు అయినా తల స్నానం చేయడానికి ఎంచుకోవచ్చు. ఈ నమ్మకాలు అసౌకర్యం లేదా బాధ కలిగించినప్పుడు వాటిని కఠినంగా అనుసరించడం కంటే.. వాటి సాంస్కృతిక ప్రాముఖ్యత, జ్యోతిషశాస్త్ర సందర్భాన్ని అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం ముఖ్యం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం మహిళలు తల స్నానం చేసే విషయంలో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ఈ నమ్మకాల ప్రకారం వివాహిత స్త్రీలు ప్రతిరోజూ తల స్నానం చేయరాదు. వివాహిత స్త్రీలు మంగళవారం, గురువారం , శనివారం వంటి కొన్ని రోజులలో తల స్నానం చేయడం నిషేధించబడింది. అయితే సోమవారం, శుక్రవారం, ఆదివారం వివాహిత స్త్రీలు తల స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
పండుగలు రోజులలో మహిళలు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కొన్నిసందర్భాల్లో ఇలా చేయకపోవడం భర్త వయస్సు,ఆర్ధిక పురోగతిని ప్రభావితం చేస్తుందని కూడా ప్రస్తావించబడింది. కనుక మహిళలు తల స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని మతపరమైన నియమాలను తెలుసుకుందాం.
ఈ నియమాలను పాటించండి
👉 వివాహిత స్త్రీలు మంగళవారం, గురువారం, శనివారం తల స్నానం చేయరాదు. ఈ రోజుల్లో తల స్నానం చేయడం వలన భర్తకు దురదృష్టం, ఇంట్లో పేదరికం వస్తుందని నమ్ముతారు.
👉 శుక్రవారం: ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున తల స్నానం చేయడం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున తల స్నానం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. అందం కూడా పెరుగుతుంది.
👉 ఆదివారం తల స్నానం చేయడానికి అనువైనదిగా పరిగణించబడుతుంది, అయితే ఆదివారం తల స్నానం వివాహిత స్త్రీలు కాదు, పెళ్లికాని అమ్మాయిలు, పురుషులు ఈ రోజున తల స్నానం చేయవచ్చు.
👉 వివాహిత స్త్రీలు ఏకాదశి రోజున తల స్నానం చేయరాదు. ఎందుకంటే ఇలా చేయడం వలన ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం ఉండదు.
👉 అమావాస్య, పౌర్ణమి, గ్రహణం రోజున తల స్నానం చేయడం వలన స్త్రీలు చేసిన పుణ్యం పోతుడ్ని. అంతేకాదు పూర్వీకులు కోపానికి గురవుతారు.
👉 సూర్యాస్తమయం , రాత్రి సమయంలో తల స్నానం చేయడం వలన ఇంట్లో సమస్యలు వస్తాయి . అనారోగ్యం వస్తుంది.
👉 శారీరక అశుద్ధత , లైంగిక సంపర్కం తర్వాత తలస్నానం చేయడం, లేదా స్నానం చేయడం అవసరం.
👉 పెళ్లికాని అమ్మాయిలు బుధవారం రోజున తల స్నానం చేయరాదు. ఎందుకంటే ఇది వారి జీవితంలో ఇబ్బందులను తెస్తుందని నమ్ముతారు.
👉 ఆలయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే లేదా ఏదైనా శుభకార్యం తర్వాత తల స్నానం చేయరాదు. ఇలా చేయడం వల్ల అదృష్టం పోయి దురదృష్టం కలుగుతుంది.
