సతీదేవి శరీరం వివిధ ముక్కలుగా విభజించబడింది. ఈ భాగాలు భూమిపై వివిధ ప్రదేశాలలో పడిపోయాయి. ఈ ప్రదేశంలో సతీదేవి కుడి చేతి పంజా చెరువులో పడి అదృశ్యమైంది. పంజా కనిపించకుండా పోవడంతో ఈ ప్రదేశాన్ని సిద్ధ పీఠంగా భావించి అలోపి శంకరి దేవి ఆలయంగా నామకరణం చేశారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారి విగ్రహం లేదు. భక్తులు ఊయలని పూజిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఊయలను సందర్శిస్తారు. గుడిలో చెరువులోని నీటిని తీసి ఊయలలో సమర్పిస్తారు
భారతదేశంలో సతీదేవి కి చెందిన మొత్తం 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ శక్తిపీఠాలన్నింటికీ వాటి సొంత ప్రత్యేకత, నమ్మకాలు ఉన్నాయి. ఈ శక్తిపీఠాల్లో సతిదేవిని వివిధ రూపాలను పూజిస్తారు. అటువంటి మాతృ దేవత ఆలయం సంగం నగరం ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. విశేషమేమిటంటే ఈ ఆలయంలో విగ్రహం లేదు.
అలోపి శంకరి దేవి శక్తి పీఠం ఆలయం పౌరాణిక నమ్మకం
ఈ పౌరాణిక కథనం ప్రకారం విచారంగా ఉన్న శివుడు సతీదేవి మృతదేహంతో ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు శ్రీ మహా విష్ణువు శివుడి దుఃఖాన్ని తగ్గించడానికి సతీదేవి మృతదేహంపై తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు. దీని కారణంగా సతీదేవి శరీరం వివిధ ముక్కలుగా విభజించబడింది. ఈ భాగాలు భూమిపై వివిధ ప్రదేశాలలో పడిపోయాయి. ఈ ప్రదేశంలో సతీదేవి కుడి చేతి పంజా చెరువులో పడి అదృశ్యమైంది. పంజా కనిపించకుండా పోవడంతో ఈ ప్రదేశాన్ని సిద్ధ పీఠంగా భావించి అలోపి శంకరి దేవి ఆలయంగా నామకరణం చేశారు.
పూజ అంటే విగ్రహాన్ని పూజించడం కాదు
ఈ శక్తిపీఠంలో అమ్మవారి విగ్రహం లేదు. భక్తులు ఊయలని పూజిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఊయలను సందర్శిస్తారు. గుడిలో చెరువులోని నీటిని తీసి ఊయలలో సమర్పిస్తారు. ఊయలకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఊయలలో అమ్మవారి రూపాన్ని దర్శించిన భక్తులు తమకు సుఖ సంతోషాలు, కీర్తి సంపదలు ఇవ్వమని ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడ కొబ్బరికాయ, సింధూరం సమర్పించడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి మొదటి రోజు గర్భగుడిలోని ఈ ఊయలతో పాటు ఆలయ సముదాయం మొత్తాన్ని అందంగా అలంకరిస్తారు. గుప్త నవరాత్రులు, దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవంగా జరుపుతారు. గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆలయాన్ని అలంకరించడానికి వారణాసి, కోల్‌కతా నుంచి అనేక క్వింటాళ్ల పువ్వులు ఆర్డర్ చేశారు.
రక్షా సూత్రానికి ప్రత్యేక గుర్తింపు
ఈ ఆలయంలో రక్షా సూత్రాన్ని కట్టే విషయంలో భక్తులకు ఓ నమ్మకం ఉంది. భక్తులు అమ్మవారి ఊయల ముందు తమ చేతులకు రక్షా సూత్రాన్ని కట్టుకుంటే అమ్మవారు తమ కోరికలన్నీ నెరవేరుస్తుందని ఒక నమ్మకం. రక్షా సూత్రం తమ చేతులకు ఉన్నంత కాలం అమ్మవారు తమని రక్షిస్తుందని విశ్వాసం.
Also read :సతీదేవి దంతం పడిన క్షేత్రం.. వినాయకుడు స్త్రీ రూపంలో దర్శనం.. ఈ మహామానిత్వ క్షేత్రం ఎక్కడంటే..