గరుడ పురాణంలో మర్త్య ప్రపంచం గురించి వివరించబడింది. మర్త్య ప్రపంచం అంటే మరణం ఉన్న ప్రపంచం.. ఇక్కడ జీవులు పుట్టి, జీవించి, చివరికి మరణిస్తారు. అయితే గరుడ పురాణంలో మరణం ఆసన్నం అయింది అని ప్రతి జీవికి తెలుస్తుందట. మరనిచడానికి ముందు కొన్ని వింతలు కనిపించడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనిపిస్తే ఆ వ్యక్తికీ మరణం అంచులలో ఉన్నాడని అర్ధమట.
ఈ ప్రపంచంలోని అతి పెద్ద సత్యం మరణం. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణించాల్సిందే. దేవుడే స్వయంగా భూమిమీద మానవ రూపంలో అవతరించినా జనన మరణ చక్రానికి అతీతుడు కాదు. ఇది ప్రకృతి నియమం. అయితే గరుడ పురాణం మరణానంతర ప్రపంచం గురించి చెబుతుంది. దీనిలో మరణానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. వాటిని తెలుసుకున్న తర్వాత, జీవితానికి మించిన వింత ప్రపంచం ఉందని మనం గ్రహిస్తాము. అయితే మరణం ఆసన్నం అయిన వ్యక్తి కొన్ని రకాల అనుభూతులు కలుగుతాయట. అంటే అతను తనకు మరణం సమీపించింది అనే అనుభూతి చెందడం ప్రారంభిస్తాడు. కొన్ని వింతైన విషయాలను చూడటం ప్రారంభిస్తాడు. మరణానికి ముందు ఒక వ్యక్తి ఏ వస్తువులను చూస్తాడో తెలుసుకుందాం.
గరుడ పురాణం హిందూ మతంలో చాలా ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు ఒక వ్యక్తి తన మంచి, చెడు పనులను చూడటం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తి తన జీవితంలో తాను చేసిన మంచి చెడుల పనులు కనుల ముందు సినిమాలా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుందట. తాను చేసిన మంచి పనులు గుర్తుకు వచ్చినప్పుడు అతనికి శాంతి లభిస్తుంది. అయితే తన చెడు పనులను గుర్తుచేసుకున్నప్పుడు అతను సందేహం, భయం, పశ్చాత్తాపం వంటి భావాలతో నిండిపోతాడు.
వింత నీడలు కనిపిస్తున్నాయి
గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు ఒక వ్యక్తి వింత నీడలను చూడటం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి ప్రతి క్షణం ఏదో నీడ తనను అనుసరిస్తున్నట్లు భావిస్తాడు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అలాంటి వ్యక్తికి తన నీడ కనిపించదు. అయితే ఇతర వింత నీడలు కనిపించడం ప్రారంభిస్తాయి. మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ మర్మమైన విషయాలను చూస్తాడు. అంతేకాదు అలాంటి వ్యక్తికి చనిపోయిన వారి ఆత్మలను కూడా చూడటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు అతను చాలా ప్రేమించే వ్యక్తుల ఆత్మలను చూస్తాడు. కొన్నిసార్లు అతను ప్రేమ లేదా గౌరవం లేని వ్యక్తుల ఆత్మలను చూస్తాడు. ఇలాంటి వ్యక్తి చివరి క్షణాల్లో ఎల్లప్పుడూ భయపడుతూ చివరి క్షణాల్లో జీవిస్తాడు.
యమ దూతలు కనిపిస్తారు
మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి యమ దూతలను చూడటం ప్రారంభిస్తాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ తనను ఎవరో తీసుకెళ్లడానికి వస్తున్నట్లు భావిస్తాడు. అతను యమ దూతలు కనిపించిన వ్యక్తి భయపడుతూనే ఉంటాడు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆధ్యాత్మిక జీవులు లేదా యమ దూతలు కనిపించే సంఖ్య పెరిగిపోతుంది. మరణానికి ముందు ఒక వ్యక్తి తన పూర్వీకులకు సంబంధించిన కలలను కనడం ప్రారంభిస్తాడు. ముఖ్యంగా మరణిస్తున్న వ్యక్తికి తన పూర్వీకులకు సంబంధించిన కలలు వస్తాయి.. అందులో పూర్వీకులు ఆ వ్యక్తిని తమ వద్దకు పిలుస్తారు. కొన్నిసార్లు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకు వచ్చి అటువంటి సంఘటన మళ్ళీ జరుగుతుందని ఆ వ్యక్తి భయపడతాడు.
మరణానంతరం మోక్షాన్ని పొందడం ఎలా
మరణం తరువాత మోక్షం పొందడం వివిధ మార్గాల్లో సాధ్యమవుతుంది. ఈ ప్రధానంగా పుణ్య కార్యాలు, భక్తి, జ్ఞానం, ధ్యానం ఉన్నాయి. మోక్షాన్ని పొందాలంటే ప్రాపంచిక కోరికలను, అనుబంధాలను త్యజించి, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది భగవంతునితో ఐక్యతను పొందాలి. పాపా కర్మలకు, చెడు పనులకుదూరంగా ఉండి.. మంచి పనులను చేస్తూ పుణ్యం సంపాదించాలి. ఇతరులకు సహాయం చేయడం, పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం.. దయ, కరుణ చూపించడం వల్ల సద్గుణాలు పెరుగుతాయి. దేవుని నామ స్మరణ క్రమం తప్పకుండా చేయడం, ప్రార్థన చేయడం, పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది.
దానధర్మాలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్లడం వంటి మతపరమైన చర్యలు, ఆచారాలు కూడా పుణ్యాన్ని పొందడంలో సహాయపడతాయి. భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటం, ఆయనను ఆరాధించడం , ఆయన ప్రేమను అనుభవించడం అవసరం. క్రమం తప్పకుండా ప్రార్థన, ధ్యానం, దేవునితో సంభాషణ భక్తికి మార్గాలు. మీ జీవితంలోని ప్రతిదాన్ని దేవునికి అంకితం చేయడం.. ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడం భక్తికి చిహ్నం.
