రేగొండ: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ తండ్రిని కుమారులు చంపారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో జరిగింది. రేపాకలో చేరాలు అనే వ్యక్తి ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య హైదరాబాద్లో కుమారుల వద్ద ఉంటోంది. మరో మహిళతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులకు తెలిసింది. దీంతో వారు గ్రామానికి వచ్చారు. మరో మహిళతో తండ్రి ఉండగా గమనించి దాడి చేశారు. దీంతో చేరాలుతో పాటు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చేరాలు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





