హైదరాబాద్‌లో శివ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, భార్య దీప్తిని వదిలి సుష్మతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. అనుమానంతో నిఘా పెట్టిన దీప్తి, శివను కూకట్‌పల్లిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Illegal Affair: మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యకు అడ్డంగా దొరికిపోయాడు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్‌కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడమే.
రూంలో రెడ్ హ్యాండెడ్‌గా..
సుష్మ అనే మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగాతెలుసుకున్న దీప్తి .. తన భర్త వ్యవహారంపై నిఘా పెట్టింది. చివరికి శివ, సుష్మతో కలిసి కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి అక్కడ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ బాధితురాలు దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి