అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మరమ్మతు పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుత్ మీటర్ మరమ్మతు చేస్తుండగా వైర్లు కాలిపోయి మెకానిక్కు గాయాలయ్యాయి.
చింతపల్లి: అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మరమ్మతు పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుత్ మీటర్ మరమ్మతు చేస్తుండగా కరెంటు తీగలు కాలిపోయి దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో రోగులంతా భయంతో బయటకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.
ఆదివారం ఉదయం నుంచి ఈ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఓ మెకానిక్ మరమ్మత్తు చేస్తుండగా వైర్లు కాలిపోయి.. అతడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అవసరమైతే విశాఖపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025