వరంగల్ లో కరెంట్ షాక్‌తో ఓ 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే మరణించాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోయి చనిపోతున్న ఘటనలు ఎక్కువ అయ్యాయి. గంటల తరబడి మొబైల్ వాడటం, తర్వాత ఛార్జింగ్ పెడుతూ కూడా యూజ్ చేయడం వల్ల ఒక్కోసారి పేలిపోతున్నాయి. మన దురదృష్టం బాలేక కొన్నిసార్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటీవల ఓ వరంగల్ జిల్లాలో ఓ 14 ఏళ్ల కుర్రాడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.
షార్ట్ సర్క్యూట్ అయ్యి..
చెన్నారావుపేటకి చెందిన రాకేష్ అనే బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఉదయం లేచిన వెంటనే సెల్‌ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టడానికి కరెంట్ బోర్డుకి ప్లగ్ పెట్టాడు. కేబుల్ మొబైల్‌కి ఎటాచ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడిక్కడే మరణించాడు. కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాకేష్ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇదిలా ఉండగా వాటర్ ట్యాంక్ పడిపోయి.. అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మోడల్ విలేజ్‌లో సెయింట్ అల్ఫాన్సా స్కూల్‌లో అనుకోకుండా వాటర్ ట్యాంకు కూలిపోయింది. దీంతో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్కూల్ ప్రాంగణంలోని విద్యార్థులు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో గోడ పడి విద్యార్థులు మరణించారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యం, నలుగురు వార్డెన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!