జ్యోతిష్యశాస్త్రంలో శని దేవుడిని ‘కర్మ ఫల ప్రదాత’గా పిలుస్తారు. అంటే మనం చేసే పనుల ఫలాలను నిక్కచ్చిగా ఇచ్చే గ్రహం శని. జాతకంలో శని స్థానం బలహీనంగా ఉన్నప్పుడు పనుల్లో ఆటంకాలు, మానసిక ఆందోళనలు ఎదురవుతాయి. ఏప్రిల్ 17 నుంచి శని ఉత్తరాభాద్రపద నక్షత్రం లోకి ప్రవేశించబోతున్నాడు.
శని నక్షత్ర మార్పు విశిష్టత: ప్రస్తుతం శుభకార్యాలు జరిగే సీజన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో శని నక్షత్ర పరివర్తనం చెందడం అనేది కీలకమైన మార్పుగా జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు వల్ల ప్రజల పనితీరు, ఆర్థిక పరిస్థితి, దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు వేగం పుంజుకోవడంతో పాటు కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి అన్నీ అనుకూలంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. పని ఒత్తిడి పెరిగినప్పటికీ, దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి గుర్తింపు దక్కుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పెద్ద ఊరట లభిస్తుంది. ఎక్కడైనా చిక్కుకుపోయిన డబ్బు లేదా మొండి బాకీలు ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి ఇది సమతుల్యతను సాధించే సమయం. వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేసే వారికి భారీ లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ నక్షత్ర మార్పు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కష్టాన్ని పైఅధికారులు గుర్తించే సమయం ఇది.
4.కన్య రాశి:
కన్య రాశి వారికి ఈ సమయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. పరిస్థితులన్నీ మీ అదుపులోకి వస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఖర్చులను నియంత్రించడం ఈ కాలంలో సులభమవుతుంది.
5.ధనుస్సు రాశి:
కెరీర్ పరంగా ధనుస్సు రాశి వారికి ఇది అత్యంత కీలకమైన సమయం. ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పని నిమిత్తం విదేశీ లేదా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు భవిష్యత్తులో మీ అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయి.
Also read
- తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే
- శని దోషాలు: శని దోషాలతో బాధ పడుతున్నారా? భయం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
- శని నక్షత్ర మార్పు: ఏప్రిల్ 17 నుంచి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు.. పట్టరాని అదృష్టం!
- నేటి జాతకములు..18 ఏప్రిల్, 2026
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.





