July 1, 2024
SGSTV NEWS
CrimeNational

ఒంటరిగా వెళ్తుంటే బలవంతంగా లాక్కెళ్లి..

మహిళపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేసిన నిందితులను కూకట్‌పల్లి పోలీసులు గురువారం ఆరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న తెల్లవారు జామున కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు గుర్తు తెలియని మహిళా(45)పై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడి, హత్య చేశారు.

మూసాపేట, ఏప్రిల్‌ 25: మహిళపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేసిన నిందితులను కూకట్‌పల్లి పోలీసులు గురువారం ఆరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న తెల్లవారు జామున కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు గుర్తు తెలియని మహిళా(45)పై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడి, హత్య చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రెండు బృందాలుగా ఏర్పడి సీసీ కెమోరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకున్నారు. నిందితులిద్దరిని సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి…

బీహార్‌కు చెందిన నితీష్‌ కుమార్‌(24), మరోనిందితుడు మైనర్‌. వీరిద్దరూ సంగారెడ్డిలోని తిరుమల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వేటార్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 20న బీహార్‌కు వెళ్తున్న తమ స్నేహితుడిని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దించి, అక్కడి నుంచి బైక్‌పై సంగారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో ప్రశాంత్‌నగర్‌లో టీ తాగడానికి ఆగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారికి అటుగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ కనిపించింది. ఆమెను గమనించి స్థానికంగా ఉన్న ఓ భవనం సెల్లారులోకి బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమె తలను నేలకు బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, మృతిచెందింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బైక్‌ నంబర్‌, సీసీ కెమోరాల ఆధారంగా నిందితులను సంగారెడ్డిలో గుర్తించి, అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్‌, డీఐ వెంకన్న, ఎస్సైలు రామకృష్ణ, ఆర్‌.ప్రేమ్‌సాగర్‌, జి.చంద్రకాంత్‌, ఇంద్రసేనారెడ్డి, కానిస్టేబుళ్లు ఎం.నవీన్‌, జయంత్‌, రాంచందర్‌, ఎండీ షకీల్‌ను ఏసీపీ అభినందించారు.

Also read

Related posts

Share via