వాహనంలోని యువకుడి దుర్మరణం
వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పిన కారు
మేడ్చర్ల్ రూరల్ : అతివేగం, ఫోన్లో సెల్ఫీ వీడియో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన గురువారం శామీర్‌పేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన మహమ్మద్ రెహాన్, మిత్రుడు ఎం.డి. అహ్మద్. వీరి స్నేహితుడు దినేష్‌రెడ్డి కారులో పెట్రోల్ పోయించేందుకు కొల్తూరు గ్రామానికి వెళ్లారు.
కారును దినేష్‌రెడ్డి నడుపుతుండగా పక్క సీటులో మహమ్మద్ రెహాన్ (18), వెనక సీటులో అహ్మద్ కూర్చున్నారు. పెట్రోల్ బంక్‌లో స్టాక్ లేదని తెలుసుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. దినేష్ రెడ్డి కారును వేగంగా నడుపుతూ సెల్ఫీ వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్తుండగా రెహాన్ గమనించి హ్యాండ్ బ్రేక్‌ను ఒక్కసారిగా లాగాడు. దీంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రెహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్ రెడ్డి అహ్మద్ లకు గాయాలయ్యాయి.
Also read
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు





