👉 ఇండియా కూటమి అభ్యర్థి జి కోటేశ్వరరావు
👉 లౌకిక, ప్రజాస్వామ్య వాదులను గెలిపించండి
👉 మతోన్మాదం, అవినీతి ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు మాత్రమే
👉 విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్
మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు సాధించి దేశంలోని లౌకికవాదానికి తూట్లు పొడవాలని కుటీల యత్నాలు చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలోతెలుగుదేశం, వైసిపి రెండు బిజెపి ఎజెండా తోనే ముందుకు సాగుతున్నాయని అన్నారు. రానున్న కాలంలో ఊసరవెల్లి రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అభ్యర్థి జీ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలలో పాల్గొనాలని, నియోజకవర్గంలోని ప్రతి సమస్య తనకు తెలుసునని అన్నారు. పుట్టింది పశ్చిమ నియోజకవర్గం లోనే, చదివింది పశ్చిమ నియోజకవర్గం లోనే, నివసిస్తున్నది పశ్చిమ నియోజకవర్గం లోనే నని ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా పనిచేస్తానని, ఎన్నికలలో తనను ఆదరించి, గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివరావు, పంచదార్ల దుర్గాంబ, తాడి పైడియ్య, అప్పురబోతు రాము, కొట్టు రమణ రావు తదితరులు పాల్గొన్నారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025