గుంటూరు: లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేయటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థునులు చెబుతున్నారు. అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గత ఏడాది కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్థరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు.
తెలంగాణలోని ఈ ఏడాది మార్చి నెలలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025