రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న స్కూటీ డిక్కీలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. ఎర్వగూడకి చెందిన ప్రదీప్ గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రూ. 2.98 లక్షలు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ జనాలు ఎక్కువగా ఉండడంతో స్కూటీ డిక్కీలో దాచి, తిరిగి పనిచేసే వన్ ల్యాబ్‌కు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత బయటకు వచ్చిన అతను నగదు చూసుకోగా కనిపించలేదు. దుండగులు స్కూటీలోని నగదునున దోచుకెళ్లినట్లు గుర్తించిన ప్రదీప్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దుండగులు నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
- సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
- ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
- Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా





