తిరువూరు (ఎన్‌టిఆర్ జిల్లా) : ఎన్‌టిఆర్ జిల్లా తిరువూరు మండల చిట్టేల టిడిపి గ్రామ సర్పంచ్ తుమ్మపల్లి శ్రీనివాసరావు భార్య, కోకిలంపాడు విఆర్‌ఒ కవిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై సర్పంచ్ శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ తనను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర పదజాలంతో మంగళవారం దూషించడమే కాక బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. బుధవారం తాను పొలానికి వెళ్తుంటే 20 మంది రౌడీలతో ఎమ్మెల్యే కొలికపూడి తమ గ్రామానికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నానని చెప్పారు. ఈ పరిణాల నేపథ్యంలో తన భార్య మనస్తాపాన్కి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయ్నానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లామని చెప్పారు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




