April 27, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

సర్పంచ్‌ భార్య ఆత్మహత్యాయత్నం

తిరువూరు (ఎన్‌టిఆర్‌ జిల్లా) : ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరు మండల చిట్టేల టిడిపి గ్రామ సర్పంచ్‌ తుమ్మపల్లి శ్రీనివాసరావు భార్య, కోకిలంపాడు విఆర్‌ఒ కవిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై సర్పంచ్‌ శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ తనను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర పదజాలంతో మంగళవారం దూషించడమే కాక బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. బుధవారం తాను పొలానికి వెళ్తుంటే 20 మంది రౌడీలతో ఎమ్మెల్యే కొలికపూడి తమ గ్రామానికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నానని చెప్పారు. ఈ పరిణాల నేపథ్యంలో తన భార్య మనస్తాపాన్కి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయ్నానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లామని చెప్పారు.

Also read

Related posts

Share via