సంగారెడ్డిలో ఓ భర్త భార్యను అతికిరాతకంగా రోకలి బండతో కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గొడవలతో పుట్టింటిలో ఉన్న భార్యపై కోపంతో దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన అత్తను రోకలితో కొట్టి గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ చెరువు మండలంలో పెద్దకంజర్ల గ్రామం రమిలా అనే మహిళకు సురేష్ (32)తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
గొడవలు రావడంతో..
కానీ గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివరకు పంచాయతీ వరకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో రమిలా తన తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా సురేశ్ అక్కడికి వెళ్లి గొడవ పడేవాడు. ఓ రోజు తీవ్ర ఆగ్రహానికి గురై రోకలి బండతో రమిలాపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా రోకలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు
హైదరాబాద్, వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జనగామ జిల్లా రాఘవాపూర్ వద్ద ఓ కారు లారీని బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025