SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి



హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.

హైదరాబాద్: నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో ఓ యువతి రోడ్డుపై పడింది. దీంతో అటుగావస్తున్న బస్సు యువతిపైకి ఎక్కడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.

Also read

Related posts