SGSTV NEWS online
Andhra PradeshCrime

మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి సవిత

మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.

Also read చిన్న వయసులోనే దానికి అడిక్ట్ అయ్యింది! నర్స్ కావాలనుకుని!

Related posts