గుంటూరు పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Road accident : గుంటూరు పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం మేరిగపూడి దగ్గర చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది, వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ బస్సు రాజస్థాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఇక, క్షతగాత్రులు అందరూ రాజస్థాన్‌కు చెందిన వారు అని సమాచారం. తీర్థయాత్రలో భాగంగా వీరంతా అన్నవరం వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..